అర్జీల పరిష్కారం వేగిరపర్చాలి
ఏలూరు(మెట్రో) : పీజీఆర్‌ఎస్‌లో అందిన అర్జీల పరిష్కారం వేగవంతం చేయాలని డీఆర్వో వి.విశ్వేశ్వరరావు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో పీజీఆర్‌ఎస్, రెవెన్యూ క్లినిక్‌లలో భాగంగా ప్రజల నుంచి 276 అర్జీలు స్వీకరించారు. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ క్లినిక్‌లు చక్కటి వేదిక అన్నారు. 28 మండలాలకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటుచేసి అర్జీలు స్వీకరించారు.
పీజీఆర్‌ఎస్ అర్జీల్లో కొన్ని..
● చింతలపూడి మండలం ప్రగడవరం–జార్జిపేటకు చెందిన తాళ్లూరి శ్రీనివాసరావు తన ఇంటిని ఆనుకుని విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటుచేశారని, దానిని మార్చాలని కోరారు.
● ముదినేపల్లి మండలం శింగారాయపాలేనికి చెందిన వేదుళ్లపల్లి సత్యవతి గ్రామ కంఠంలో ఉన్న భూమి ఆక్రమణకు గురైందని ఫిర్యాదు చేశారు.
● ద్వారకాతిరుమల మండలం కోడిగూడేనికి చెందిన బిరుదుగడ్డ మాణిక్యం తనకు ఉన్న కొద్దిపా టి పొలం తన కోడలు మాయమాటలు చెప్పి రిజిస్ట్రేషన్ చేయించుకుందని, తిరిగి ఇప్పించాలని అర్జీ అందించారు.
● జంగారెడ్డిగూడెం మండలం చిన్నవారిగూడేనికి చెందిన బండారు చంద్రమౌళి తన పట్టా భూమికి రక్షణ కల్పించాలని వినతిపత్రం అందించారు.
● లింగపాలెం మండలం కలరాయనగూడెం పరిధిలోని అటవీ భూముల్లో ఆక్రమణలు జరు గు తున్నాయని కోడూరి సురేష్ ఫిర్యాదు చేశా రు. అక్రమ ఆక్రమణలు జరుగుతున్నాయని కోడూ రి సురేష్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. సర్వే నంబర్లు 264, 269 పరిధిలోని అటవీ భూమిలో వ్యవసాయం చేయడంతో పాటు కోడి పందేలకు ఏర్పాట్లు చేస్తున్నారని అన్నారు.


