కోడిపందేల బరి ధ్వంసం
నూజివీడు: సంకాంత్రి సందర్భంగా కోడిపందేలు వేసేందుకు మండలంలోని తుక్కులూరులో సిద్ధం చేసిన కోడిపందేల బరిని రూరల్ సీఐ కొప్పిశెట్టి రామకృష్ణ ఆధ్వర్యంలో రూరల్ ఎస్సై జ్యోతీబసు, స్టేషన్ సిబ్బంది ధ్వంసం చేశారు. దీనిలో భాగంగా బరిని ట్రాక్టర్‌తో దున్నించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ పండుగ పేరుతో కోడిపందేలు, జూదాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సంక్రాంతి పండుగను శాంతియుతంగా కుటుంబంతో ఆనందంగా జరుపుకోవాలన్నారు. జూదాలు, కోడిపందేల జోలికి వెళ్లి ఆర్థికంగా నష్టపోవొద్దని విజ్ఞప్తి చేశారు.
భీమవరం: చదరంగం క్రీడ అన్ని వయస్సుల వారికి మేథస్సును పెంచడమేగాక మానసిక వికాసానికి ఎంతగానో దోహదం చేస్తుందని భీమవరం మావుళ్లమ్మ ట్రస్ట్‌బోర్డు చైర్మన్ బొండాడ నాగభూషణం అన్నారు. అనసూయ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో ఆదివారం భీమవరం ఆర్యవైశ్య యువజన సంఘం భవనంలో ఏపీ స్టేట్ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్‌ను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ టోర్నమెంట్‌కు వివిధ జిల్లాల నుంచి 56 మంది చెస్ క్రీడాకారులు హాజరయ్యారు. కార్యక్రమంలో చెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మాదాసు కిషోర్, గమిని పవన్, ఉపాధ్యక్షుడు పరుచూరి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
ఏలూరు (టూటౌన్): విద్యతోనే అభివృద్ధి సాధ్యం అవుతుందని, ప్రతి విద్యార్థి తమ ఇంట భారత దేశ పవిత్ర గ్రంథమైన రాజ్యాంగ పుస్తకాన్ని ఉంచుకోవాలని రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ సోళ్ల బొజ్జిరెడ్డి కోరారు. స్థానిక గిరిజన భవన సమావేశ మందిరంలో ఆదివారం ఎస్టీ ఉద్యోగుల సంఘం డైరీ ఆవిష్కరణ, 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 200 మంది నిరుపేద విద్యార్థులకు విద్యా ఉపకరణాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ సోళ్ల బొజ్జిరెడ్డితోపాటు ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి), ఏపీ ఎస్టీ కమిషన్ సభ్యులు పన్నర్సు వెంకటప్ప, కాకి లక్ష్మి పాల్గొన్నారు.
జంగారెడ్డిగూడెం: సంక్రాంతి పండుగ సందర్భంగా సీపీఎస్ ఉద్యోగులకు డీఏ బకాయిలు చెల్లించాలని ఏపీసీపీఎస్‌ఈఏ రాష్ట్ర కార్యదర్శి ఆర్ నాగ దుర్గారావు ప్రభుత్వాన్ని కోరారు. 2018 జూలై నుంచి ఇప్పటి వరకూ సీపీఎస్ ఉద్యోగులకు ఒక్క డీఏ ఏరియర్ కూడా చెల్లించలేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఐఆర్ ఇస్తామని చెప్పి ఇప్పటివరకు ప్రకటించలేదని, వెంటనే ఉద్యోగులకు ఐఆర్ ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు.
నూజివీడు: అప్పుల బాధ తట్టుకోలేక వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నూజివీడు మండలం బోర్వంచ శివారు కొన్నంగుంటలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కొన్నంగుంటకు చెందిన ఆరేపల్లి దేవి(36), శివయ్య దంపతులు. వీరు కూలి పనులకు వెళ్లడంతో పాటు శివయ్య ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అయితే ఇల్లు నిర్మించుకునే సమయంలో అప్పులు చేయడం, ఆ అప్పులు రోజురోజుకు పెరిగిపోతుండగా వాటిని తీర్చే మార్గం కనపడక మనస్తాపంతో ఆదివారం తెల్లవారుజామున ఆరేపల్లి దేవి ఇంటి వద్ద చీరకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈమెకు వివాహమైన కుమార్తె, కుమారుడు ఉన్నారు. రూరల్ ఎస్సై ఎన్ లక్ష్మణ్‌బాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నూజివీడులోని ఏరియా ఆసుపత్రికి తరలించారు.
కోడిపందేల బరి ధ్వంసం
కోడిపందేల బరి ధ్వంసం
కోడిపందేల బరి ధ్వంసం
కోడిపందేల బరి ధ్వంసం


