మహోద్యమంలా కోటి సంతకాలు
న్యూస్‌రీల్
10న ఏలూరుకు..
ఇష్టారాజ్యంగా శంకుస్థాపన
సత్తాల పంచాయతీ సండ్రకుంటలో కొందరు టీడీపీ నేతలు నిబంధనలను తుంగలోకి తొక్కి, ఓ అభివృద్ధి కార్యక్రమానికి శంకుస్థాపన చేయడం వివాదాస్పదమైంది. 8లో u
ఏడు నియోజకవర్గాల్లోనూ..
ప్రయాణికుల ముసుగులో గంజాయి రవాణా చేస్తున్న ముగ్గురు సభ్యుల ముఠాను ఏలూరులో రైల్వే పోలీసులు పట్టుకున్నారు. 34.5 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. 8లో u
ఆదివారం శ్రీ 7 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
సాక్షి ప్రతినిధి, ఏలూరు: కోటి సంతకాల సేకరణ మహోద్యమం తారాస్థాయికి చేరింది. పల్లె గడపలో ప్రారంభమైన సంతకాల సేకరణ ఇంటింటికీ అనే రీతిలో ఉద్యమంలా స్వచ్ఛందంగా ప్రజలే కొనసాగిస్తున్నారు. వైద్య కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్‌సీపీ పిలుపునిచ్చిన కోటి సంతకాల సేకరణకు ఏలూరు జిల్లాలో అపూర్వ స్పందన లభించింది. ఏడు నియోజకవర్గాల్లో పార్టీ ఇన్‌చార్జులతో మొదలైన సంతకాల సేకరణ కార్యక్రమం మండల స్థాయి అక్కడి నుంచి గ్రామస్థాయి వరకూ విస్తరించింది.
వైఎస్సార్‌సీపీ ప్రజా ఉద్యమం
వైద్య కళాశాలలను ప్రైవేటీకరణ చేయాలన్న చంద్రబాబు సర్కారు ప్రయత్నాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ప్రజా ఉద్యమానికి వైఎస్సార్‌సీపీ అక్టోబర్‌లో శ్రీకా రం చుట్టింది. నియోజకవర్గ స్థాయి సమావేశాలతో కార్యక్రమాన్ని ప్రారంభించి గ్రామస్థాయి వరకు ప్రణాళికాబద్ధంగా కార్యక్రమాన్ని కొనసాగించారు. రచ్చబండల పేరుతో పల్లెల్లో స్వచ్ఛందంగా సంతకాల సేకరణ నిర్వహించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హయాంలో రాష్ట్రంలో 17 కళాశాలలకు శ్రీకారం చుట్టి ఐదింటిని పూర్తి చేసి 880 ఎంబీబీఎస్ సీట్లు రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులోకి తెచ్చా రు. దీనిలో భాగంగా ఏలూరు ప్రజల చిరకాల వాంఛగా మిగిలిన ఏలూరు ప్రభుత్వ వైద్య కళాశాలను వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉండగానే పూర్తి చేశారు. 2023లో 150 ఎంబీబీఎస్ సీట్లతో కళాశాల ప్రారంభమై కొనసాగుతూ ఉంది. ప్రతి జిల్లాలో ప్ర భుత్వ వైద్యకళాశాల ఉండాలనే సంకల్పంతో గత ప్రభుత్వం ఏలూరు, పాలకొల్లులో ప్రభుత్వ వైద్య కళాశాలను టీచింగ్ హాస్టల్‌తో కలిపి మంజూరు చే సింది. ఈ క్రమంలో 17 కళాశాలల్లో 10 కళాశాలల ను ప్రైవేటీకరణ చేస్తామని చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో వైఎస్సార్‌సీపీ ప్రజల పక్షాన పోరుబాట కొనసాగిస్తుంది. ఈ క్రమంలో గత నెల లో అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన ర్యాలీలు, ఆందోళనలు నిర్వహించి తహసీల్దార్ కార్యాలయాల్లో వినతిపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమం తుది దశకు చేరుకుంది.
ఈనెల 10న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పూర్తయిన కోటి సంతకాల పత్రాలను ఏలూరు జిల్లా పార్టీ కార్యాలయానికి భారీ ర్యాలీగా చేర్చేలా నియోజకవర్గ సమన్వయకర్తలు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఈనెల 15న ఏలూరు నుంచి భారీ ర్యాలీగా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపి అనంతరం గవర్నర్‌కు వినతిపత్రం అందించనున్నారు. ఈ క్రమంలో శనివారం పార్టీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు పోలవరం, చింతలపూడి నియోజకవర్గాల్లో పార్టీ సమన్వయకర్తల నేతృత్వంలో నిర్వహించిన సమావేశాల్లో ఎమ్మెల్సీ, పార్టీ జిల్లా పరిశీలకుడు వంకా రవీంద్రతో కలిసి దిశా నిర్దేశం చేశారు.
వైద్య కళాశాల ప్రైవేటీకరణపై వైఎస్సార్‌సీపీ పోరుబాట
సంతకాల సేకరణకు ప్రతి పల్లెలోనూ మద్దతు
జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లోనూ ఉధృతంగా కార్యక్రమం
ఈనెల 10న జిల్లా కేంద్రానికి చేరనున్న సంతకాల పత్రాలు
15న భారీ ర్యాలీగా తాడేపల్లికి సంతకాల పత్రాలు
విస్తృతస్థాయి సమావేశాలు నిర్వహిస్తున్న పార్టీ జిల్లా అధ్యక్షుడు డీఎన్నార్
జిల్లా కేంద్రమైన ఏలూరుతో సహా ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇప్పటికే లక్షలాది సంతకాల సేకరణను పూర్తి చేశారు. ఏలూరు నగరంలో నియోజకవర్గ సమన్వయకర్త మామిళ్లపల్లి జయప్రకాష్ నేతృత్వంలో 50 డివిజన్లల్లో సంతకాల సేకరణ పూర్తి చేసి జిల్లా కోర్టు వద్ద ప్రభుత్వ కార్యాలయాల సమీపంలో ఇలా ప్రత్యేక ప్రాంతాల్లో కూడా క్యాంప్‌లు ఏర్పాటు చేసి మరీ కార్యక్రమం నిర్వహించారు. కై కలూరు నియోజకవర్గంలోని కై కలూరు, ముదినేపల్లి, మండవల్లి, కలిదిండి మండలాల్లో పార్టీ జిల్లా అధ్యక్షుడు, నియోజకవర్గ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు నేతృత్వంలో గ్రామగ్రామాన కార్యక్రమం కొనసాగుతోంది. నూజివీడు నియోజకవర్గంలో చాట్రాయి, ఆగిరిపల్లి, ముసునూరు, నూజివీడు మండలాల్లో నియోజకవర్గ సమన్వయకర్త మేకా వెంకట ప్రతాప్ అప్పారావు నేతృత్వంలో సంతకాల సేకరణ కార్యక్రమం కొనసాగుతుంది. అలాగే ఉంగుటూరు నియోజకవర్గంలో సమన్వయకర్త పుప్పాల వాసుబాబు నేతృత్వంలో అన్ని మండలాల్లో సమావేశాలు నిర్వహించి రచ్చబండ కార్యక్రమం ద్వారా సంతకాల సేకరణ కొనసాగిస్తున్నారు. పోలవరం నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో పార్టీ సమస్వయకర్త తెల్లం బాలరాజు నేతృత్వంలో సంతకాల సేకరణ కొనసాగుతుంది. అలాగే చింతలపూడి నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో పార్టీ సమన్వయకర్త కంభం విజయరాజు, దెందులూరు నియోజకవర్గంలో పార్టీ సమన్వయకర్త కొఠారు అబ్బయ్యచౌదరి నేతృత్వంలో అన్ని మండలాల్లో కార్యక్రమం కొనసాగుతుంది.
మహోద్యమంలా కోటి సంతకాలు


