అలసత్వం తగదు
ఏలూరు (మెట్రో): స్థానిక కలెక్టరేట్‌లో శనివారం పీజీఆర్‌ఎస్ అర్జీలు, 22ఏ కేసులు, అడంగల్, ఇంటి స్థలాలు, రీ సర్వే, ఐవీఆర్‌ఎస్, ఆక్రమణలు క్రమబద్ధీకరణ, ఎంఎస్‌ఎంఈ పార్కులు, కోర్టు కేసులు, సీసీఆర్‌సీ కార్డులు తదితర 12 అంశాలపై కలెక్టర్ కె.వెట్రిసెల్వి సమీక్షించారు. ప్రగతిలో వెనుకబడిన తహసీల్దార్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అలసత్వం తగదని, లక్ష్యాలు పూర్తిచేయకుంటే సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. జేసీ ఎంజే అభిషేక్ గౌడ, డీఆర్వో వి.విశ్వేశ్వరరావు, నూజివీడు సబ్ కలెక్టర్, ఆర్డీఓలు పాల్గొన్నారు.
స.హ.చట్టం బ్రహ్మాస్త్రం : సమాచార హక్కుచట్టం–20 ఏళ్ల వేడుకలను కలెక్టరేట్‌లో నిర్వహించారు. సమాచార హక్కు చట్టం ప్రజల చేతిలో బ్రహ్మాస్త్రం అని కలెక్టర్ అన్నారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): రిజిస్ట్రేషన్ శాఖ లక్ష్యాలను పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటున్నా మని స్టాంప్స్, రిజిస్ట్రేషన్స్ శాఖ ఏలూరు రేంజ్ డీఐజీ ఎన్.మాధవి అన్నారు. శనివారం ఏలూ రు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని సందర్శించి తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మా ట్లా డుతూ ఈ ఏడాదిలో ఇప్పటివరకూ 66 శాతం లక్ష్యాలను చేరుకున్నామని, ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి వంద శాతం లక్ష్యాలను పూర్తి చేసేలా సిబ్బందికి అవగాహన కలిగిస్తున్నామ న్నారు. గతేడాదితో పోలిస్తే పాట్లు, ఇళ్లకు సంబంధించి దాదాపు రెండు వేల దస్తావేజుల రిజిస్ట్రేషన్లు తగ్గాయన్నారు. రిజిస్ట్రేషన్ సేవలను వేగవంతం చేయడానికే కార్డ్ 2.0 విధానాన్ని అమలు చేస్తున్నామన్నారు. ఎనీవేర్ రిజిస్ట్రేషన్ విధానం కారణంగా కొన్ని తప్పుడు రిజిస్ట్రేషన్లు జరుగుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఏలూరు కార్యాలయంలో సేవలందించే విషయంలో ఆలస్యం జరగడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా రిజిస్ట్రార్ కె.శ్రీనివాసరావు, ఏలూరు జాయింట్ సబ్ రిజిస్ట్రార్ ఎన్.లావణ్య ఉన్నారు.
ఏలూరు టౌన్: ప్రపంచంలోనే పెద్ద ప్రజాస్వామ్య దేశానికి రాజ్యాంగాన్ని అందించిన బీఆర్ అంబేడ్కర్ సేవలను మరుమలేమని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్) అన్నారు. ఏలూరులోని పార్టీ కార్యాలయంలో శనివారం అంబేడ్కర్ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. పార్టీ నాయకులతో కలిసి అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం డీఎన్నార్ మాట్లాడుతూ ప్రపంచ మేధావిగా, దార్శనికునిగా అంబేడ్కర్ సమసమాజ స్థాపనకు విశేష కృషి చేశారన్నారు. ఏలూరు నియోజకవర్గ ఇన్‌చార్జి మామిళ్లపల్లి జయప్రకాష్ మాట్లాడుతూ ప్రజలకు దిశానిర్దేశం చేస్తూ ఆయన రచించిన రాజ్యాంగం అందరికీ మార్గదర్శకమన్నారు. పార్టీ ఎస్పీ సెల్ జిల్లా అధ్యక్షుడు తేరా ఆనంద్, ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూకపెయ్యి సుధీర్‌బాబు, నగర ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఇనపనూరి జగదీష్, జిల్లా అధికార ప్రతినిధి మున్నుల జాన్‌గురునాథ్ మాట్లాడుతూ సమాజంలో అంతరాలను రూపుమాపేలా, స్వేచ్ఛ, సమానత్వం, అభివృద్ధి సాధించేలా అంబేడ్కర్ ర చించిన రాజ్యాంగం దిక్సూచిలా నిలుస్తుందన్నారు. పార్టీ నగర అధ్యక్షుడు గుడిదేశి శ్రీనివాసరావు, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు నెరుసు చిరంజీవి, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి తుమరాడ స్రవంతి, నగర మహిళా అధ్యక్షురాలు జిజ్జువరపు విజయనిర్మల, జిల్లా మ హిళా ఉపాధ్యక్షురాలు డింపుల్ పాల్గొన్నారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. రాష్ట్రంలో ఉన్న రెండు యూనియన్లు ఐక్యవేదికగా ఏర్పడి డిమాండ్ల సాధన కోసం కార్యాచరణ రూపొందించు కుని శనివారం నుంచి వచ్చేనెల 5వ తేదీ వర కూ వివిధ కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు జిల్లావ్యాప్తంగా తొలి రోజు సొసైటీల్లో ఉద్యోగులు నల్ల రిబ్బన్లు ధరించి నిరసన తెలిపారు. యూనియన్‌ల ఐక్యవేదిక జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కేవీవీ సత్యనారాయణ, పూజారి సుబ్బారావు ఉద్యమ వివరాలను వెల్లడించారు. ఈనెల 8న రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్ర సహకార బ్యాంకు బ్రాంచిల వద్ద ధర్నా నిర్వహి స్తామన్నారు.
అలసత్వం తగదు


