బీసీల పక్షపాతి మాజీ సీఎం జగన్‌ | - | Sakshi
Sakshi News home page

బీసీల పక్షపాతి మాజీ సీఎం జగన్‌

Dec 7 2025 8:40 AM | Updated on Dec 7 2025 8:40 AM

బీసీల

బీసీల పక్షపాతి మాజీ సీఎం జగన్‌

ఏలూరులో వైఎస్సార్‌సీపీ నేతల ర్యాలీ, ధర్నా

ఏలూరు టౌన్‌: రాష్ట్రంలో బీసీల పక్షపాతిగా ఉంటూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బీసీల అభ్యున్నతి చేసిన కృషి ప్రతిఒక్కరూ గుర్తుపెట్టుకోవాలనీ, టీడీపీ పాలనలో బీసీలకు చేసిన మేలు ఏమిటో చెప్పాలని వైఎస్సార్‌సీపీ ఏలూరు ఇన్‌చార్జి మామిళ్లపల్లి జయప్రకాష్‌ అన్నారు. ఏలూరు ఫైర్‌స్టేషన్‌ సెంటర్‌లో టీడీపీ బీసీ నాయకులు కొందరు మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ చిత్రపటాన్ని ద హనం చేసిన ఘటనపై వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఆ గ్రహం వ్యక్తం చేశారు. ఏలూరు సీఎస్‌ఐ చర్చి సమీ పంలోని పార్టీ కార్యాలయం నుంచి భారీ సంఖ్యలో ర్యాలీ చేశారు. ఏలూరు పాత బస్టాండ్‌ సెంటర్‌కు చేరుకుని అక్కడ కొద్దిసేపు శాంతియుత నిరసన ప్రదర్శన చేపట్టారు. అనంతరం పాత బస్టాండ్‌ సెంటర్‌లోని అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళుర్పించారు. అలాగే మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.

వైఎస్సార్‌సీపీ పాలనలో బీసీలకు పెద్దపీట

ఏలూరు ఇన్‌చార్జి జేపీ మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గత ఐదేళ్ల పా లనలో బీసీల అభ్యున్నతికి ఎలా పనిచేశారో ప్రజలంతా చూశారని స్పష్టం చేశారు. పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తూ దేశానికే మార్గదర్శకంగా నిలిచారన్నారు. బీసీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు నెరుసు చిరంజీవి మాట్లాడుతూ చంద్రబాబు పాలనలో బీసీలకు చేసిందేమీ లేదనీ, కావాలనే బీసీలను రె చ్చగొట్టి ఆందోళనలు చేయిస్తున్నారని విమర్శించా రు. నగర మహిళా అధ్యక్షురాలు జిజ్జువరపు విజయనిర్మల మాట్లాడుతూ జగన్‌ చిత్రపటాన్ని దహ నం చేసిన నాయకులపై కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. పార్టీ నగర అధ్యక్షుడు గుడిదేశి శ్రీనివాసరావు, ఎస్సీ సెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూకపెయ్యి సుధీర్‌బాబు, జిల్లా అధికార ప్రతినిధి మున్నుల జాన్‌గురునాథ్‌, వాణిజ్య విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఘంటా మోహనరావు, ఎస్సీ సెల్‌ నగర అధ్యక్షుడు ఇనపనూరి జగదీష్‌, పార్టీ నేతలు తుమరాడ స్రవంతి, డింపుల్‌జాబ్‌, పల్లి శ్రీనివాస్‌, స్టాన్లీబాబు, బుద్దాల రాము, భోగిశెట్టి పార్వతి, తులసీ, తులసీ వర్మ, లీగల్‌ సెల్‌ అధ్యక్షుడు ప్రత్తిపాటి తంబి, యువజన నాయకులు ప్రత్తిపాటి విక్టర్‌ తదితరులు పాల్గొన్నారు.

బీసీల పక్షపాతి మాజీ సీఎం జగన్‌ 1
1/1

బీసీల పక్షపాతి మాజీ సీఎం జగన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement