Maharashtra: గాడిదపాలను ఎగబడి కొంటున్నారు..

Donkey Milk Sells For Rs 10,000 A Litre In Maharashtras District Know Why - Sakshi

హింగోలి: గాడిదపాల వ్యాపారం జిల్లాలో జోరుగా సాగుతోంది. అంతేకాదు గాడిద పాలు తాగడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుందని, శరీరంలో చాలా శక్తివంతంగా పనిచేస్తుందని విక్రేతలు చెప్తున్నారు కూడా. కరోనా వంటి ఇన్ఫెక్షన్‌లకు వ్యతిరేకంగా పోరాడటంలో ఇది చాలా ప్రభావవంతంగా పనిచేస్తుందనే నమ్మకం కూడా లేకపోలేదు. దీంతో గాడిద పాలకు గరిష్ఠంగా లీటరుకు పది వేల రూపాయలు వెచ్చించిమరీ మహారాష్ట్రలోని హింగోలి జిల్లాలో బారీ స్థాయలో క్రయవిక్రయాలు కొనసాగుతున్నాయి.  

హింగోలిలో వీధి వీధికి గాడిద పాలను విక్రయిస్తున్నారు. స్పూను పాలు తాగితే అన్ని రకాల రోగాలు దూరమవుతాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. గాడిదపాలల్లో ఔషధగుణాలు అధికంగానే ఉంటాయని, పిల్లలకు న్యుమోనియాను దూరం చేస్తుందని, జ్వరం, దగ్గు, జలుబు వంటి వ్యాధులతో పోరాడి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుందని పాల విక్రయదారులు నమ్మబలికి వ్యాపారం చేస్తున్నారు. అనేక వ్యాధులపై ప్రభావవంతంగా పనిచేస్తుందని టీస్పూన్ పాలను రూ. 100కు, ఒక లీటరు పాలు ఏకంగా రూ. 10,000లకు అమ్ముతున్నారు. పుట్టిన బిడ్డకు 3 సంవత్సరాల వరకు రోజూ ఈ పాలను తాగిపిస్తే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందనే ప్రచారం కొనసాగుతోంది. దీనితో జనాలు విపరీతంగా కొనుగోలు సాగిస్తున్నారు.

వైద్యులు ఏమి చెబుతున్నారంటే..
ఈ వందంతులన్నీ పూర్తిగా అవాస్తవాలని, గాడిద పాలు తాగడం వల్ల కరోనా లాంటి ఇన్ఫెక్షన్లు నయమవుతాయనేది అసాధ్యమని, ఇలాంటి వదంతులకు మోసపోవద్దని డాక్టర్‌ వీఎన్ రోడ్జ్ చెబుతున్నారు. వైద్యుల సలహా మేరకే మందులు వాడాలి. ఎవరినీ గుడ్డిగా నమ్మకూడదు. ప్రజలు తమ డబ్బును వృధాగా ఖర్చు చేసకోవద్దని సూచించారు.

చదవండి: పదేళ్ల బాలిక సక్సెస్‌ఫుల్‌ బిజినెస్‌.. నెలకు కోటిపైనే ఆదాయం...

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top