కుట్రలు.. కుయుక్తులు | - | Sakshi
Sakshi News home page

కుట్రలు.. కుయుక్తులు

Nov 27 2026 12:20 AM | Updated on Nov 27 2026 12:20 AM

● ఎన్నికల వేళ ‘కూటమి’ ప్రలోభాలు

● ప్రతి పోరులోనూ అరాచక పర్వమే

● ఓటమి భయంతోనే కుట్రలు

కపిలేశ్వరపురం: కూటమి పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదు. పైగా సామాన్య ప్రజలపై ధరల పిడుగులు పడుతూనే ఉన్నాయి. సంక్షేమం గాలికి వదిలేశారు. కొత్త పింఛన్లు లేవు. యువతకు ఉపాధి, నిరుద్యోగ భృతి లేదు. ఇన్ని సమస్యలు నడుమ కూటమి ప్రభుత్వం అనివార్య పరిస్థితిల్లో స్థానిక ఎన్నికలు నిర్వహిస్తుంది. ప్రజల మదిలో కూటమి ప్రభుత్వం పట్ల సానుకూల వైఖరి లేదన్నది గమనించి కూటమి నాయకులు ఎలాగన్నా గెలవాలన్న లక్ష్యంతో ప్రలోభాలకు తెరలేపారు. అప్రజాస్వామికంగా ఎన్నికల్లో వ్యవహరించారు. వెరసి ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యింది.

ఉమ్మడి జిల్లాలో ఎన్నికలు ఇలా..

మొత్తం 72 డివిజన్లు గల రాజమహేంద్రవరం, 66 డివిజన్లు గల కాకినాడ కార్పొరేషన్‌ ఎన్నికల పోలింగ్‌ గురువారం ముగిసింది. ఇందులో అడుగడుగునా ఓటర్ల ప్రలోభాలకు గురిచేశారు. ఇసుక, మద్యం మాఫియాలో సంపాదించిన సొమ్మును ఇలా వాడినట్లు ఆరోపణలు వచ్చాయి. తూర్పుగోదావరి జిల్లాలో 36 వార్డుల పరిధిలో 49,059 మంది ఓటర్లు గల మండపేట, 28 వార్డుల పరిధిలో 34,452 మంది ఓటర్లు గల కొవ్వూరు, 32 వార్డుల పరిధిలో 35,086 మంది ఓటర్లు గల నిడదవోలు మున్సిపాలిటీల్లో ఈ నెల 1న ఎన్నికలు నిర్వహించారు. కాకినాడ జిల్లాలో 36 వార్డుల పరిధిలో 43,036 ఓటర్లు గల తుని, 36 వార్డుల్లో 43,307 ఓటర్లున్న పిఠాపురం, 36 వార్డుల్లో 43,865 ఓటర్లున్న సామర్లకోట, 32 వార్డుల్లో 41,528 ఓటర్లున్న పెద్దాపురం, 28 వార్డుల్లో 25,472 ఓటర్లున్న ఏలేశ్వరం, 23 వార్డుల్లో 25,472 ఓటర్లున్న గొల్లప్రోలు మున్సిపాలిటీల్లో ఎన్నికలు పూర్తయ్యాయి. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో 36 వార్డుల్లో 41,079 మంది ఓటర్లున్న అమలాపురం, 32 వార్డుల్లో 35,728 మంది ఉన్న రామచంద్రపురం మున్సిపాలిటీల్లోనూ, 23 వార్డుల్లో 21,228 మంది ఓటర్లు ముమ్మిడివరం నగర పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించారు. ఈ నెల 5న తూర్పుగోదావరి జిల్లాలో 21 జెడ్పీటీసీ, 405 ఎంపీటీసీ, కాకినాడ జిల్లాలో 20 జెడ్పీటీసీ, 401 ఎంపీటీసీ, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో 19 జెడ్పీటీసీ, 379 ఎంపీటీసీ, పోలవరం జిల్లాలో 12 జెడ్పీటీసీ, 101 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. వాటిలో కొన్ని స్థానాలు ఏకగ్రీవం కాగా మిగిలిన వాటికి పోలింగ్‌ నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లాలో 332 పంచాయతీలు, 3,872 వార్డులకు, కాకినాడ జిల్లాలో 379 గ్రామాలు, 4,226 వార్డులకు, కోనసీమ జిల్లాలో 342 పంచాయతీలు, 3,873 వార్డులు, పోలవరం జిల్లాలో 186 పంచాయతీ, 1,734 వార్డు స్థానాలకు మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు.

పచ్చ ముసుగులో పనిచేస్తూ..

మున్సిపల్‌, పరిషత్‌ ఎన్నికల సమయాల్లో ప్రభుత్వ అధికారులు, పోలీసులు కూటమి ప్రభుత్వం కనుసన్నల్లో పని చేశారన్న ఆరోపణలున్నాయి. మున్సిపల్‌ పోలింగ్‌ కవరేజి కోసం ప్రభుత్వం మీడియా పాస్‌లను జారీ చేసినప్పటికీ వాటిని పోలింగ్‌ కేంద్రాల వద్ద అనుమతించలేదు. పోలీస్‌ ఉన్నతాధికారులు తమకు లిస్ట్‌ పంపారని, అందులో పేరు ఉన్నవారినే అనుమతిస్తామంటూ ఓ తరహా మీడియాను విస్మరించారు. నామినేషన్లు, పోలింగ్‌, ఫలితాల వెల్లడి ప్రక్రియల్లో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థుల పట్ల చిన్నచూపు చూశారన్న వాదన ఉంది.

ప్రలోభాలకు పాల్పడిన కూటమి నాయకులు

స్థానిక ఎన్నికల్లో కూటమి నాయకులు ప్రలోభాలకు పాల్పడ్డారు. ఎన్నికల నిబంధనలను తుంగలోకి తొక్కారు. నిడదవోలు, మండపేట తదితర మున్సిపాలిటీల పరిధిలో కూటమి అభ్యర్థులు రూ. వెయ్యి నుంచి రూ.మూడు వేలు ఇచ్చినట్టు వార్తలొచ్చాయి. బిర్యానీ ప్యాకెట్లు, చీరలు, స్వీటు ప్యాకెట్లు పంచారు. చైర్మన్‌ అభ్యర్థులు పంచిన వాటితో సరిపెట్టుకోలేని కూటమి వార్డు అభ్యర్థులు వారి తరఫున రూ. రెండు వందల నుంచి రూ.ఐదు వందలు పంచారు. మద్యం కూడా అందించారు.

అప్రజాస్వామిక దాడులు

స్థానిక ఎన్నికల నేపథ్యంలో కూటమి నేతలు అప్రజాస్వామికంగా వ్యవహరించారు. ఎదురించిన వైఎస్సార్‌ సీపీ శ్రేణులపైనా పోలీసులు, అధికారుల ద్వారా అణచివేసే ప్రయత్నం చేశారు. అనపర్తి నియోజకవర్గంలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభానికి ముందు వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలు, సానుభూతిపరుల ఓట్లు తొలగించే కుట్రలు కూటమి నాయకులు చేశారు. ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలయ్యాక కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. ఈ నెల 5న అనపర్తి బాలికల హైస్కూల్‌ పోలింగ్‌ కేంద్రం వద్ద పరిషత్‌ ఎన్నికల పోలింగ్‌ జరుగుతుండగా టీడీపీ నాయకులు వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలపై దాడి చేశారు. జనసేన మండపేట నియోజకవర్గ ఇన్‌చార్జి వేగుళ్ల లీలాకృష్ణ స్వగ్రామం కపిలేశ్వరపురం మండలం వల్లూరులోని ఓ పోలింగ్‌ బూత్‌లో బయట నుంచి వచ్చిన జనసేన కార్యకర్తలు రిగ్గింగ్‌కు పాల్పడ్డారంటూ ఉన్నతాధికారులకు స్థానిక వైఎస్సార్‌ సీపీ నాయకులు ఫిర్యాదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement