ఓటు వేసి.. చైతన్యం నింపి | - | Sakshi
Sakshi News home page

ఓటు వేసి.. చైతన్యం నింపి

Nov 27 2026 12:20 AM | Updated on Nov 27 2026 12:20 AM

రాజమహేంద్రవరం సిటీ: స్థానిక మోరంపూడి సిటీ స్పెషల్‌ అప్పర్‌ ప్రైమరీ స్కూల్‌లోని పోలింగ్‌ కేంద్రంలో మాజీ ఎంపీ మార్గాని భరత్‌ రామ్‌ తన సతీమణి మోనాతో కలసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్‌ కేంద్రంలోకి వెళ్లిన ఆయనకు సిబ్బంది ఇచ్చిన బ్యాలెట్‌ పేపర్‌పై అభ్యంతరం వ్యక్తం చేశారు. కార్పొరేటర్‌కు ఇద్దరు అభ్యర్థులు పోటీలో ఉంటే ఒకటి సైకిల్‌, రెండు ఫ్యాన్‌ గుర్తులు పెట్టి వదిలేయకుండా కింద ఇంటూ మార్కు పెట్టడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలా చేయడం వల్ల ఓటర్లు గందరగోళానికి గురవుతారని, మూడో అభ్యర్థి లేనప్పుడు బ్యాలెట్‌ను ఖాళీగా వదిలేయకుండా ఇంటూ మార్కు ఎలా పెడతారని నిలదీశారు. ఈ విషయాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ దృష్టికి, ఎన్నికల అధికారి దృష్టికి తీసుకు వెళ్తానని తెలిపారు. రాజమహేంద్రవరం వైఎస్సార్‌ సీపీ మేయర్‌ అభ్యర్థి దాసి వెంకటరావు జెఎన్‌ రోడ్డులోని ఏకేసీ జూనియర్‌ కళాశాల పోలింగ్‌ స్టేషన్‌లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్ని కుట్రలు పన్నినా వైఎస్సార్‌ సీపీ విజయాన్ని ఎవరూ ఆపలేరన్నారు. స్థానిక అక్షరశ్రీ స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్‌ బూత్‌లో రాజమహేంద్రవరం పార్లమెంటరీ నియోజకవర్గ వైఎస్సార్‌ సీపీ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ గూడూరి శ్రీనివాస్‌ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement