పల్లెల్లో.. 78.47% | - | Sakshi
Sakshi News home page

పల్లెల్లో.. 78.47%

Nov 27 2026 12:20 AM | Updated on Nov 27 2026 12:20 AM

రాజమహేంద్రవరం రూరల్‌: తొలి విడత పల్లె పోరు ముగిసింది.. పీఠమెక్కే ప్రథమ పౌరులెవరనేది తేలిపోయింది. ఈ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ గురువారం జరిగింది. ఓటర్ల చైతన్యంతో 78.47 శాతం ఓటింగ్‌ నమోదైంది. జిల్లాలోని కడియం, రాజమహేంద్రవరం రూరల్‌, చాగల్లు, కొవ్వూరు, తాళ్లరేవు మండలాల్లో పంచాయతీల సర్పంచ్‌, వార్డు సభ్యుల ఎన్నికల్లో పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. ఐదు మండలాల్లో పరిధిలో 51 గ్రామ సర్పంచ్‌ స్థానాలకు ఒకటి ఏకగ్రీవంకాగా, మిగిలిన 50 సర్పంచ్‌ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మొత్తం 634 మంది వార్డు సభ్యుల స్థానాలకు 45 ఏకగ్రీవం కాగా, మిగిలిన 589 వార్డు సభ్యుల స్థానాలకు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్‌ జరిగింది. ఈ ఎన్నికల్లో 78.47 శాతం పోలింగ్‌ నమోదైంది. 2,33,467 మంది ఓటర్లకు గాను 1,83,195 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉదయం నుంచి ఓటర్లు ఓటు వేసేందుకు బారులు తీరారు. జిల్లా కలెక్టర్‌ కీర్తి చేకూరి ఆధ్వర్యంలో తొలి విడత పంచాయతీ ఎన్నికలను అధికారులు ప్రశాంతంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ నరసింహకిషోర్‌ నేతృత్వంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు నిర్వహించారు. పోలింగ్‌ అనంతరం బ్యాలెట్‌ బాక్స్‌లను ఆయా గ్రామాల్లోని ఎన్నికల కౌంటింగ్‌ కేంద్రాలకు అధికారులు తరలించారు.

మండలం పంచాయతీలు వార్డులు ఓటర్లు పోలైన ఓట్లు శాతం

కడియం 10 138 62,081 47,904 77.16

రాజమహేంద్రవరం రూరల్‌ 1 18 23,007 14,635 63.61

చాగల్లు 13 154 50,857 40,284 79.21

కొవ్వూరు 16 190 55,640 46,135 82.92

తాళ్లపూడి 11 134 41,882 34,237 81.75

మొత్తం 51 634 2,33,467 1,83,195 78.47

ఫ తొలి విడత ముగిసిన పల్లె పోరు

ఫ 2,33,467 మంది ఓటర్లకు

1,83,195 మంది వినియోగం

ఫ పంచాయతీల్లో

కొలువుతీరనున్న కొత్త పాలకవర్గాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement