రాజప్పకు ఎదురుదెబ్బ | - | Sakshi
Sakshi News home page

రాజప్పకు ఎదురుదెబ్బ

Nov 27 2026 12:20 AM | Updated on Nov 27 2026 12:20 AM

సామర్లకోట: టీడీపీ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి, ప్రస్తుత పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్పకు తను నివాసం ఉంటున్న గ్రామంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ గ్రామస్తులు తమ సర్పంచ్‌గా వైఎస్సార్‌ సీపీ మద్దతుదారుకు పట్టం కట్టారు. రాజప్ప ప్రస్తుతం సామర్లకోట మండలం అచ్చంపేట గ్రామంలో నివాసం ఉంటున్నారు. ఇక్కడ గురువారం జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూటమి మద్దతుతో సర్పంచ్‌గా పోటీ చేసిన అడ్డాల తులసీ ఆదిలక్ష్మి పై వైఎస్సార్‌ సీపీ బలపరిచిన అభ్యర్థి, ఆ పార్టీ పెద్దాపురం నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు వీరంరెడ్డి నాని భార్య పరిమళ ఆధిక్యత సాధించారు. అయితే, ఆమె విజయంపై అధికారులు ప్రకటన చేయకపోవడంతో అచ్చంపేట యూపీ స్కూల్‌ ఆవరణలోని కౌటింగ్‌ కేంద్రం వద్ద ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. చివరకు పరిమళ విజయం సాధించినట్లు రిటర్నింగ్‌ అధికారి (ఆర్‌ఓ) ప్రకటించారు. రీ కౌంటింగ్‌కు కూట మి నాయకులు పట్టు పట్టినప్పటికీ ఆర్‌ఓ అంగీకరించలేదు. దీంతో కౌంటింగ్‌ హాలు లోనికి 10 మంది వరకు కూటమి నాయకులు ప్రవేశించడంతో ఉద్రిక్తత ఏర్పడింది. గ్రామస్తులు కూడా పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకుని ధర్నా చేశారు. సుమారు నాలుగు గంటల అనంతరం వైఎస్సార్‌ సీపీ మద్దతుదారు పరిమళ 46 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించినట్లు అధికారులు ప్రకటించారు. గ్రామంలో 12 వార్డులుండగా వైఎస్సార్‌ సీపీ మద్దతుదారులు ఏడుచోట్ల గెలిచారు. అయితే, రీ కౌంటింగ్‌ పేరుతో ఓట్లను మాయ చేసి ఆరు వార్డులు మాత్రమే గెలిచినట్లు అధికారులు ప్రకటించారని వైఎస్సార్‌ సీపీ మద్దతుదారులు చెప్పారు. ఈ నేపథ్యంలో సర్పంచ్‌ అభ్యర్ధి రీకౌంటింగ్‌కు వారు అంగీకరించలేదు. 20 ఓట్లకు మించి ఆధిక్యత వస్తే ఏవిధంగా రీకౌంటింగ్‌ చేస్తారనే ప్రశ్నకు అధికారులు జవాబు చెప్పలేని పరిస్థితి ఏర్పడింది.

పెద్దాపురం ఎమ్మెల్యే

స్వగ్రామంలో ‘ఫ్యాన్‌’ హవా

ఉద్రిక్త వాతావరణం నడుమ

వైఎస్సార్‌ సీపీ మద్దతుదారు గెలుపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement