జగన్‌ నిజం.. ఆయనవైపే ప్రజానీకం | - | Sakshi
Sakshi News home page

జగన్‌ నిజం.. ఆయనవైపే ప్రజానీకం

Sep 14 2026 12:20 AM | Updated on Sep 14 2026 12:20 AM

వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు

చెల్లుబోయిన

వేగేశ్వరపురంలో పార్టీలో భారీ చేరికలు

తాళ్లపూడి: రాష్ట్రంలో అబద్దం, మోసపూరిత పాలన సాగుతుందని జగన్‌ నిజం చంద్రబాబు అబద్ధం అని వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ అన్నారు. జగన్‌కు పట్టం కట్టడం కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని ఆయన పేర్కొన్నారు. మండలంలోని వేగేశ్వరపురంలో మాజీ ఎంపీపీ, పార్టీ సీనియర్‌ నాయకుడు కొమ్మిరెడ్డి పరశు రామారావు ఆధ్వర్యంలో నియోజకవర్గ కోఆర్డినేటర్‌, మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు సమక్షంలో పార్టీలో భారీ చేరికలు జరిగాయి. గ్రామానికి చెందిన యువ నాయకుడు కురసాల సతీస్‌ (వెంకట సత్యనారాయణ) సహా భారీగా మహిళలు, యువతకు వారిద్దరితో పాటు రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా, నిడదవోలు కో ఆర్డినేటర్‌, మాజీ ఎమ్మెల్యే జి.శ్రీనివాసనాయుడు, రాజమండ్రి పార్లమెంటరీ పార్టీ కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ గూడూరి శ్రీనివాస్‌, కొవ్వూరు నియోజక వర్గ పరిశీలకుడు గొందేసి శ్రీనివాసరెడ్డి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు వేణుగోపాల కృష్ణ మాట్లాడుతూ ఇచ్చిన హామీలను విస్మరించి కూటమి ప్రభుత్వం ప్రజలను మోసగించిందన్నారు. ఎల్లో మీడియా, చానళ్ల మోసపూరిత సమాచారంతో మంచి పాలనను కోల్పోయామని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలను చంద్రబాబు రెచ్చగొడుతున్నారని అన్నారు. సతీష్‌ రాకతో పార్టీకి మంచి జరుగుతుందని అన్నారు. చంద్రబాబు, కరువు అన్నదమ్ములని ఆయన ఎప్పుడు వచ్చినా రాష్ట్రంలో ఏదో ఒక కరువు వస్తుందన్నారు. మాజీ ఎమ్మెల్యే వెంకట్రావు మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసిన దమ్మున్న నాయకుడు జగన్‌ అని, చంద్రబాబు నాటి స్థానిక ఎన్నికల్లో పోటీలో లేకుండా నాడు తొక ముడిచారని అన్నారు. డీఎస్సీలో అక్రమాలపై సవాల్‌ విసిరి ముందుకు రావడం లేదని అన్నారు. జక్కంపూడి రాజా మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలంతా శాంతి భద్రతల సమస్యలతో సతమతమవుతున్నారని, రాష్ట్ర భవిష్యత్‌ కోసం, జగనన్నకి మళ్లీ పట్టం కట్టాలని ప్రజల ఎదురు చూస్తున్నారన్నారు. డాక్టర్‌ గూడూరి శ్రీనివాస్‌ మాట్లాడుతూ చంద్రబాబు పాలన మోసపూరితంగా సాగుతోందన్నారు. మాజీ ఎమ్మెల్యే శ్రీనివాసనాయుడు మాట్లాడుతూ సతీష్‌ లాంటి యువత పార్టీలో చేరడంతో రానున్న రోజుల్లో పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. మాజీ ఎంపీపీ కొమ్మిరెడ్డి పరశురామారావు మాట్లాడుతూ తన రాజకీయ గురువు జీఎస్‌ రావు ఆధ్వర్యంలో రాజకీయాల్లో 40 ఏళ్లుగా ఆరు ఎన్నికల్లో ఐదు సార్లు ఎంపీపీ, సర్పంచ్‌ పదవులు పొందామన్నారు. ఏఎంసీ మాజీ చైర్మన్‌, రాష్ట్ర కార్యదర్శి బండి అబ్బులు మాట్లాడుతూ కొవ్వూరు నియోజకవర్గంలో వైసీపీ మరింత బలోపేతం చేయాలన్నారు. కార్యక్రమంలో మండల కన్వీనర్‌ కొలిశెట్టి నాగేశ్వరరావు, ఎంపీపీ జొన్నకూటి పోసిరాజు, జెడ్పీ వైస్‌ చైర్‌ పర్శన్‌ పోసిన శ్రీలేఖ, రాజానగరం పరిశీలకుడు, రాష్ట్ర కార్యదర్శి తోట రామకృష్ణ, కొవ్వూరు నియోజకవర్గ పరిశీలకుడు గొండేసి శ్రీనివాసరెడ్డి, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు కంఠమని రమేష్‌, మాజీ ఎంపీపీ వీర రాఘవమ్మ, రాష్ట్ర కార్యదర్శులు వల్లభశెట్టి శ్రీనివాస్‌, గూడా విజయరాజు, బండి అబ్బులు, ఇంటి వీర్రాజు, పప్పోపుల నాని, నియోజక వర్గంలోని మూడు మండలాల నాయకులు చిట్టూరి అన్నవరం, తిరుమలశెట్టి అన్నవరం, కుంటముక్కల కేశవనారాయణ, పెండెం పోసిబాబు, ఒంబోలు పోసిబాబు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement