గోదావరి వాసుల చిరకాల స్వప్నంగా, ఆదికవి నన్నయ పేరిట ఏర్పడిన ఈ యూనివర్సిటీ ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో అతి పెద్ద విశ్వవిద్యాలయంగా ఉంది. అదే ఒరవడితో విద్యార్థులను ఉన్నత స్థాయిలో నిలిపేందుకు అవసరమైన విద్యను అందిస్తూ, యూనివర్సిటీల్లో అగ్రస్థానాన నిలిచేలా ‘నన్నయ’ అభివృద్ధి చెందాలనేదే అందరి ఆశయం. ఎందరో మహనీయుల కృషితో ఏర్పడిన ఈ వర్సిటీ అంచెలంచెలుగా ఎదుగుతూ విద్యాసుమాలను విరబూయిస్తోంది.
– ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ, వైస్ చాన్సలర్, ఆదికవి నన్నయ యూనివర్సిటీ ●


