దాడి.. ఆపై దోపిడీ
అంబాజీపేట: ఇంట్లో ఒంటరిగా ఉన్న ఓ వృద్ధురాలిపై దాడి చేసి ఆమె మెడలోని బంగారు గొలుసుతో గుర్తుతెలియని వ్యక్తి పరారయ్యాడు. అంబాజీపేట ఎస్సై చిరంజీవి కథనం ప్రకారం.. మాచవరం గ్రామానికి చెందిన ర్యాలి సత్యనారాయణ ఇంట్లో అతని అత్తయ్య దేవగుప్తపు లక్ష్మి నివాసం ఉంటున్నారు. శనివారం తెల్లవారు జామున ఇంటి ఆవరణలో ఉన్న బాత్‌రూమ్‌కి వెళ్లి వస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ఆమె తలపై గాయపరిచాడు. అనంతరం లక్ష్మి మెడలో ఉన్న 9 గ్రాముల బంగారు గొలుసుతో పరారయ్యాడు. సమీపంలో నివాసముంటున్న అతని అల్లుడు సత్యనారాయణకు జరిగిన సంఘటనను లక్ష్మి వివరించింది. దాంతో పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలాన్ని పి.గన్నవరం సీఐ ఆర్.భీమరాజు, ఎస్సై కె.చిరంజీవిలు పరిశీలించారు. లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.


