జాతీయ స్థాయి తైక్వాండో పోటీలకు ఎంపిక
రాజోలు: ఇంజినీరింగ్ ఇంటర్ యూనివర్సిటీ జాతీయ స్థాయి తైక్వాండో పోటీలకు రాజోలుకు చెందిన గెద్దాడ తేజోమయి హేమ శ్రీదేవి అర్హత సాధించినట్లు కోచ్ రాయుడు మణికుమార్ శనివారం తెలిపారు. భీమవరం ఎస్‌ఆర్‌కేఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్న తేజోమయి ఈ నెల 27న కాకినాడ జేఎన్‌టీయూలో జరిగిన తైక్వాండో పోటీల ఎంపికలో అర్హత సాధించిందన్నారు. మార్చి 16వ తేదీ నుంచి 20వ తేదీ వరకూ ఒడిశాలోని ఫకీర్‌మోహన్ యూనివర్సిటీలో జరిగే జాతీయ స్థాయి పోటీలకు హాజరవుతుందన్నారు. జాతీయ స్థాయి పోటీల్లో జేఎన్‌టీయూకే యూనివర్సిటీ తరఫున తైక్వాండో పోటీల్లో పాల్గొనే అవకాశం సాధించిన తేజోమయిని మణికుమార్ అభినందించారు.


