చెట్టును ఢీకొన్న స్కూల్‌ బస్సు | - | Sakshi
Sakshi News home page

చెట్టును ఢీకొన్న స్కూల్‌ బస్సు

Mar 1 2026 7:51 AM | Updated on Mar 1 2026 7:51 AM

చెట్టును ఢీకొన్న  స్కూల్‌ బస్సు

చెట్టును ఢీకొన్న స్కూల్‌ బస్సు

సఖినేటిపల్లి: ఓ ప్రైవేట్‌ స్కూల్‌ బస్సు అదుపుతప్పి చెట్టును ఢీకొన్న ఘటనలో విద్యార్థులు త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఆ వివరాల ప్రకారం.. అంతర్వేది రాంబాగ్‌ వద్ద శనివారం సఖినేటిపల్లికి చెందిన ఓ స్కూల్‌ బస్సు ప్రధాన రహదారి మార్జిన్‌లో కొబ్బరి చెట్టును ఢీకొంది. ఆ సమయంలో బస్సులో 8 మంది విద్యార్థులు ఉండగా, స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సును డ్రైవర్‌ కాకుండా క్లీనర్‌ డ్రైవ్‌ చేస్తున్నట్టు స్థానికులు చెబుతున్నారు. గాయాలైన విద్యార్థులను సమీప ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement