‘భౌ’విలాపం
‘లైట్లు’ ఓకే.. అన్నీ ‘వెలగకే’
పేగు బంధం కన్నీరు పెట్టించింది.. మాచవరం భారత్ గ్యాస్ కంపెనీ సమీపంలో ప్రధాన రహదారిపై ఓ కుక్క పిల్లను గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఆ కుక్క పిల్ల తల్లి బిగ్గరగా ఆర్తనాదాలు చేసుకుంటూ సంఘటన ప్రాంతానికి వచ్చింది. తన పిల్ల మృతి చెందడంతో కన్నీరు కారుస్తూ, దాని చుట్టూ తిరుగుతూ ఆ కుక్క కంటతడి పెట్టింది. ఇది చూపరుల హృదయాలను ద్రవింపజేసింది. –అంబాజీపేట
కత్తిపూడి దిగమర్రు 216 జాతీయ రహదారిలో గొల్లప్రోలు టోల్‌ప్లాజా వద్ద (గొల్లప్రోలు ఊళ్లకి వెళ్లే దారి దగ్గర) అటు, ఇటు ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేశారు. కానీ ఒక్క రోజు అవి వెలిగిన సందర్భం లేదు. రూ.కోట్లలో టోల్ ఫీజులు వసూలు చేయడం తప్ప, ఇక్కడ లైట్లు వెలిగించకపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు.
– పిఠాపురం
‘భౌ’విలాపం
‘భౌ’విలాపం
‘భౌ’విలాపం


