టిప్పర్‌ ఢీకొని యువకుడి మృతి | - | Sakshi
Sakshi News home page

టిప్పర్‌ ఢీకొని యువకుడి మృతి

Feb 21 2026 7:30 AM | Updated on Feb 21 2026 7:30 AM

టిప్పర్‌ ఢీకొని యువకుడి మృతి

టిప్పర్‌ ఢీకొని యువకుడి మృతి

అనపర్తి: మోటార్‌ సైకిల్‌ను టిప్పర్‌ ఢీకొనడంతో ఓ యువకుడు మృతి చెందిన ఘటన గురువారం రాత్రి జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. అనపర్తి మార్కండేయపురానికి చెందిన సబ్బెళ్ల గౌరీశంకర్రెడ్డి కుమారుడు వీర ప్రకాష్‌రెడ్డి (26) రాత్రి 11.15 గంటలకు అనపర్తి సెంటర్‌కు వెళ్లి తిరిగి నల్ల కాలువ వైపు మోటార్‌ సైకిల్‌పై వస్తున్నాడు. ఈ నేపథ్యంలో వెనుక నుంచి టిప్పర్‌ వచ్చి మోటార్‌ సైకిల్‌ను ఢీకొంది. టిప్పర్‌ ముందు చక్రాల కింద వీరప్రకాష్‌రెడ్డి పడిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై ఎల్‌.శ్రీనునాయక్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement