విద్యార్థిని అదృశ్యం
అమలాపురం టౌన్: స్థానిక మున్సిపల్ కాలనీకి చెందిన, 9వ తరగతి విద్యార్థిని అమలదాసు హషిత (14) అదృశ్యమైంది. దీనిపై పట్టణ సీఐ పి.వీరబాబు పర్యవేక్షణలో ఎస్సై ఎన్‌ఆర్ కిషోర్‌బాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హషిత గురువారం సాయంత్రం స్థానిక రవణం మల్లయ్య వీధిలోని ట్యూషన్‌కు ఇంటి నుంచి బయలు దేరింది. మళ్లీ తిరిగి రాలేదు. ట్యూషన్‌కూ చేరుకోలేదు. సీఐ వీరబాబు, ఎస్సై కిషోర్‌బాబులు రాత్రి రవణం మల్లయ్యవీధి తదితర ప్రాంతాల్లో సీసీ కెమెరాల పుటేజ్‌లను పరిశీలించారు. సీసీ పుటేజీల్లో బాలిక పది మీటర్లు ముందుకు వెళ్లి వెనక్కి తిరిగిన దృశ్యాన్ని గుర్తించారు. ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వీరబాబు తెలిపారు. ఆ బాలిక సమాచారం తెలిస్తే 94407 96561, 81435 79127 నంబర్లకు తెలపాలన్నారు.


