జంట ఆత్మహత్యాయత్నం
యానాం/ తాళ్లరేవు: యానాం బైపాస్ రహదారి సమీపంలోని సుంకరపాలెంలో ఓ లాడ్జిలో ఓ జంట ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. పోలీసుల కథనం ప్రకారం.. పాలకొల్లు పట్టణానికి చెందిన కావూరి రమేష్, బొక్కా భాగ్యశ్రీ గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వారు ఇంటి నుంచి పారిపోయి ఈ నెల 1న యానాం సమీపంలో సుంకరపాలెంలోని ఓ లాడ్జిలో దిగారు. ఆ ఇద్దరూ ఆదివారం తెల్లవారుజామున పురుగు మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు. అపస్మారక స్థితిలో ఉన్నవారిని చూసిన లాడ్జి యాజమాన్యం స్థానికుల సహాయంతో చికిత్స నిమిత్తం యానాం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్సకు కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే ఆ జంటకు ఇది వరకే వివాహాలు అయినట్లు బంధువులు చెబుతు న్నారు. 28 ఏళ్ల రమేష్‌కు ఒక అమ్మాయి ఉండగా, భాగ్యశ్రీకి ఇద్దరు పిల్లలు ఉన్నారని అంటున్నారు. ఆ మెకు వివాహమై 12 ఏళ్లు అయ్యిందని, భర్త దుబాయ్ లో ఉంటున్నట్లు తెలిపారు. ఇరువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తు న్నట్లు తాళ్లరేవు ఎస్సై పి.సత్యనారాయణ తెలిపారు.


