నేడు 999 మంది నృత్య ప్రదర్శన
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): భారత శాసీ్త్రయ కళల పరిరక్షణలో రాజమహేంద్రవరం మరో చరిత్రాత్మక ఘట్టానికి వేదికగా మారనుంది. కళాప్రియ నృత్య కళాక్షేత్రం ఆధ్వర్యంలో ‘‘భారతీయ శాసీ్త్రయ మహా బృంద నాట్యం’’ కార్యక్రమం, నోబుల్ వరల్డ్ రికార్‌ుడ్స సాధన లక్ష్యంగా ఘనంగా జరగనుంది. ఆదివారం స్థానిక జేఎన్‌రోడ్డులోని చెరుకూరి వీరరాజు సుబ్బలక్ష్మి కన్వెన్షన్ హాల్‌లో అచంట చంద్రశేఖర్ ఆధ్వర్యంలో 999 మంది నృత్యకళాకారులు ఏకకాలంలో మా తెలుగు తల్లికి మల్లెపూదండ గీతానికి నృత్యప్రదర్శన చేయనున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను ఎస్‌కేవీటీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ తిరుపాణ్యం మాట్లాడుతూ యువత శాసీ్త్రయ కళల వైపు మరింత ఆకర్షితులవ్వాల్సిన అవసరం ఉందన్నారు. నిర్వాహకుడు నాట్యాచార అచంట చంద్రశేఖర్ మాట్లాడుతూ శాసీ్త్రయ నాట్యాల ద్వారా దేశభక్తి, సంస్కృతి పరిరక్షణ, కళల పట్ల గౌరవాన్ని పెంపొందించడమే ఈ మహా బృంద నాట్య కార్యక్రమం ప్రధాన ఉద్దేశమన్నారు. తెలుగు శాఖ అధిపతి డాక్టర్ పీవీబీ సంజీవరావు మాట్లాడుతూ ఈ మహత్తర కార్యక్రమం చెరుకూరి వీరరాజు కల్యాణ మండపంలో ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభమవుతుందని తెలిపారు. బీజేపీ నాయకుడు దాసరి ధర్మరాజు, అధ్యాపకులు పల్లి సుధా, లలిత రమ్య, జై సుగుణ, ఎస్ రాజ్ కుమార్ పాల్గొన్నారు.


