అప్పనపల్లి... భక్తులతో శోభిల్లి
మామిడికుదురు: బాల తిరుపతి అప్పనపల్లి శ్రీబాల బాలాజీ స్వామి ఆలయం శనివారం భక్తులతో కోలాహలంగా మారింది. తొలి హారతితో స్వామివారు భక్తులకు నయనానందకరంగా దర్శనమిచ్చారు. ఏడుకొండల వాడా.. వెంకటరమణా.. గోవిందా.. గోవిందా.. అంటూ స్వామివారి దివ్య స్వరూపాన్ని భక్తులు దర్శించుకుని ఆనంద పరవశితులయ్యారు. అనంతరం అర్చకుల నుంచి వేద ఆశీర్వచనం అందుకున్నారు. తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. స్వామివారికి వివిధ సేవల ద్వారా రూ.1,97,626 ఆదాయం వచ్చిందని ఆలయ ఈఓ ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు. 4,500 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకోగా, రెండు వేల మంది అన్న ప్రసాదం స్వీకరించారని చెప్పారు. నిత్యాన్నదాన ట్రస్టుకు భక్తులు రూ.66,397 విరాళాలుగా అందించారన్నారు.
అప్పనపల్లి బాల బాలాజీని దర్శించుకుంటున్న భక్తులు


