● పంట పండింది రోయ్..
పంట పండింది రోయ్ అంటూ మత్స్యకారులు సంబరాలు చేసుకుంటున్నారు. పల్లిపాలెం కేంద్రంగా సముద్రంపై వేట సాగించే వారికి వారంలో రెండు, మూడు రోజుల్లో వేటలో అరుదైన భారీ సైజు ల్యాబ్‌స్టర్ రకం రొయ్యలు చిక్కుడమే దీనికి కారణం. వలకు చిక్కి ఫిషింగ్ హార్బర్‌కు చేరిన వీటిని కొనుగోలు చేయడానికి ప్రజలు పోటీపడుతున్నారు. ఒక్కో ల్యాబ్‌స్టర్ రొయ్య సుమారు 750 గ్రాములు బరువు తూగుతూ, రూ.800 తక్కువ గాకుండా అమ్ముడుపోతోంది. సాధారణంగా ఈ రకమైన ల్యాబ్‌స్టర్ రొయ్యలు కన్యాకుమారి, మండపం, కేరళ వంటి కొన్ని తీరప్రాంతాల్లో మాత్రమే లభిస్తాయని, అంతర్వేది సముద్ర తీరంలో ఈ రకం భారీ సైజులో రొయ్యలు దొరకడం అరుదని వారు చెబుతున్నారు. సఖినేటిపల్లి


