సంచార జీవితం.. సాపాటుకు సతమతం
అయినవిల్లి: కూటి కోసం కోటి విద్యలు అనే నానుడి అందరికీ తెలిసిందే. ఈ కోవలోదే వీరి జీవన విధానం. కమ్మరి పనిని జీవనాధారంగా చేసుకుని కుటుంబంతో పాటు దేశ సంచారం చేస్తూ పల్లెలు, పట్టణాలు తిరుగుతూ వీరు పొట్ట పోసుకుంటున్నారు. వ్యవసాయ, ఇంటి పనుల్లో వాడే పనిముట్ల తయారీలో వీరిది అందే వేసిన చేయి. పిల్లాపాపలతో కలిసి రోడ్డు పక్కన చిన్న గుడారాలు వేసుకుని వర్షం, ఎండ, చలిని లెక్క చేయకుండా జీవన పోరాటం చేస్తుంటారు. సంచార జాతులకు చెందిన రెండు కుటుంబాల వారు అయినవిల్లి మండల పరిషత్ కార్యాలయం ఎదుట ఖాళీ స్థలంలో గుడారం వేసుకుని నెల రోజులుగా జీవనం సాగిస్తున్నారు. వీరిది మధ్యప్రదేశ్.
చలిలో వణుకుతూ...
గజగజ వణికించే చలిలోనూ పిల్లా పాపలతో గుడారంలో తలదాచుకుని వీరు జీవనం సాగిస్తున్నారు. పదిమందికి పైనే ఇక్కడ ఉంటున్నారు. ఈ ప్రాంతం వ్యవసాయం ఆధారం కావడంతో వీరి పనికి గిరాకీ బాగానే ఉంది. కత్తులు, కొడవళ్లు, గునపాలు, పారలు, ఇంటి అవసరాలకు ఉపయోగపడే పెనం, అట్లకాడ ఇలా పలు ఇనుప సామాన్లు వీరు తయారు చేస్తున్నారు.
అప్పుడు మకాం మారుస్తాం
గిరాకీ ఉంటే రోజుకు రూ.మూడు వేలు వస్తుంది. కుటుంబ ఖర్చులు పోను రూ.2 వేలు మిగులుతుంది. గిరాకీ లేకపోతే ఉన్న డబ్బుతోనే జీవనం సాగిస్తున్నాం. డబ్బు మొత్తం ఖర్చయిపోతే పస్తులుండాల్సిందే. అప్పుడు మరో చోటుకు మకాం మారుస్తాం.
– జగదీష్ చౌహాన్
రోగాలు వస్తే అంతే
చలి అయిన ఎండ అయిన వాన అయిన రోడ్డు పక్కనే గుడారాల్లో జీవనం సాగిస్తాం. ఎవ్వరూ మమ్ముల్ని పక్కకు చేర నీయరు. ఊరు గానీ ఊరు మమ్మల్ని ఎవరూ నమ్మరు. రోగాలు వస్తే మా ఖర్మ మాదే. చిన్న పిల్లలతో అలాగే జీవనం సాగించాలి.
– అర్జున్
కమ్మరి పనిలో కుటుంబం అంతా
కష్టపడితే రోజుకు రూ.3 వేల ఆదాయం
ఖర్చులు పోను మిగిలేది రూ.2 వేలు
గిరాకీ లేకపోతే పస్తులే
రోగమొస్తే దేవుడే దిక్కు
సంచార జీవితం.. సాపాటుకు సతమతం
సంచార జీవితం.. సాపాటుకు సతమతం
సంచార జీవితం.. సాపాటుకు సతమతం


