వీఆర్‌ఓలకు ఉద్యోగోన్నతులు
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో గ్రేడ్ 1 గ్రామ రెవవెన్యూ అధికారులుగా పనిచేస్తున్న 34 మందికి సీనియర్ అసిస్టెంట్‌లుగా ఉద్యోగోన్నతి కల్పిస్తూ గురువారం జిల్లా రెవెన్యూ అధికారి జె.వెంకట్రావు ఉత్తర్వులు అందించారు. ఈ సందర్భంగా వీఆర్వో సంఘ నాయకులు కలెక్టర్, డీఆర్వోను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. రెండు సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న ఈ పోస్టుల కోసం ఏపీ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భూపతిరాజు రవీంద్రరాజు కృషి చేశారని వీఆర్వో సంఘ నాయకులు తెలిపారు. అసోసియేషన్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి మద్దాల బాపూజీ, సహాయ కార్యదర్శి అనిశెట్టి రామకృష్ణ, జిల్లా అధ్యక్షుడు యల్లేశ్వరావు పాల్గొన్నారు.


