చాగల్లు, సాక్షి టాస్క్‌ఫోర్స్: కూటమి ప్రభుత్వంలో మందుబాబులను అడ్డంగా దోచుకుంటున్నారు. మద్యం ధరలు తగ్గించినా ఆ విషయాన్ని దాచిపెట్టి మందుబాబుల జేబులు గుల్లచేస్తున్నారు. చాగల్లు కేంద్రంగా జిల్లాలో పలు మండలాల్లోని మద్యం దుకాణాల్లో ఈ దందా జరుగుతోంది. అయినా ఎకై ్సజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం ఆ వైపు కన్నెత్తి చూడడం లేదు. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని నంద్యాల డిస్టలరీ నుంచి హెచ్‌డీ బ్రాండ్‌తో విడుదల అవుతున్న విస్కీతో ఈ మోసం జరుగుతోంది. నంద్యాల డిస్టలరీ నుంచి తూర్పుగోదావరి జిల్లాలోని చాగల్లు డిపోకు వస్తున్న ఈ హెచ్‌డీ విస్కీని డీలర్లు అయిన కాడికి అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. అందుకోసమే పెద్దగా ఆదరణ లేని హెచ్‌డీ విస్కీని ఒకే సారి కేసులకు కేసులు డీలర్లు కొనుగోలు చేస్తున్నారు. రూ.130 ఉన్న హెచ్‌డీ బ్రాండ్ విస్కీ బాటిల్ ఇటీవల రూ.120కు తగ్గింది. తగ్గిన ధర ప్రకారం బాటిల్‌పై ఎంఆర్‌పీ రూ.120గా ముద్రించాలి. కానీ ధర తగ్గినప్పటికీ బాటిల్‌పై లేబుల్‌లో మాత్రం ఇప్పటికీ ఎంఆర్‌పీ రూ.130గా ఉంటోంది. తగ్గిన ఎంఆర్‌పీకి అనుగుణంగా డిపో నుంచి హెచ్‌డీ బ్రాండ్ విస్కీని రూ.100కే డీలర్లకు సరఫరా చేయాలి. దాన్ని డీలర్ రూ.120కి విక్రయించాలి. అయితే డిపో నుంచి డీలర్లకు రూ.100కే లభిస్తున్నా మందుబాబులకు మాత్రం రూ.130కు విక్రయిస్తున్నారు. పాత లేబుల్ రూ.130తోనే హెచ్‌డీ విస్కీ బాటిళ్లను విక్రయిస్తున్న విషయం తెలిసినా ఎకై ్సజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం చూసీ చూడనట్టు వదిలేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. సాధారణంగా ఈ బ్రాండ్‌కు పెద్దగా ఆదరణ లేకపోవడంతో అమ్మకాలు కూడా పెద్దగా ఉండవు. డిపో నుంచి రోజూ 30 నుంచి 40 కేసులు మాత్రమే వెళుతుంటాయి. ఇప్పుడు ఒకే రోజు 3,500 కేసులు మార్కెట్‌లోకి వెళ్లినట్టు తెలుస్తోంది. చాగల్లు డిపో పరిధిలోని కొవ్వూరు, తాళ్లపూడి, చాగల్లు, జంగారెడ్డిగూడెం తదితర మండలాల్లోని సుమారు 105 షాపులలో సగానికి పైగా షాపులకు హెచ్‌డీ బాటిళ్లు సరఫరా చేశారు.
హెచ్‌డీ విస్కీ ధర తగ్గిన వైనం కానీ పాత రేటుకే అమ్మకాలు
చాగల్లు కేంద్రంగా అక్రమార్కుల దందా