
గాజుల సింగారం
మామిడికుదురు: శ్రావణ మాసం రెండవ శుక్రవారం సందర్భంగా నగరం గ్రామ దేవత శ్రీదొడ్డి గంగాలమ్మను స్థానికులు గాజులతో విశేషంగా అలంకరించారు. సౌభాగ్యానికి ప్రతీకగా భావించే గాజులను దండలుగా కూర్చి అమ్మవారి మెడలో అలంకరించారు. ఈ సందర్భంగా అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహించారు. ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు అధిక సంఖ్యలో ఈ పూజల్లో పాల్గొన్నారు. గాజులతో అలంకార శోభితమైన దొడ్డి గంగాలమ్మను దర్శించుకున్నారు. అమ్మవారికి ముడుపులు, మొక్కులు చెల్లించారు.
నోట్ల తోరణం
సీటిఆర్‌ఐ (రాజమహేంద్రవరం) : నగరంలోని దేవీచౌక్‌లో శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి ఆలయంలో అమ్మవారిని రూ.45వేల కొత్త నోట్లతో అలంకరించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అరుదైన అలంకారం
కొత్తపేట: మండల పరిధిలోని వానపల్లి గ్రామ దేవత పళ్లాలమ్మ అమ్మవారు గాజుల అలంకరణతో దర్శనమిచ్చారు. మహిళలు అందరూ పసుపు, కుంకుమలు, చలివిడి, పానకం, వడపప్పు, గాజులు, శ్రావణమాసం సారెతో వానపల్లి కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయం వద్దకు చేరుకున్నా రు. అక్కడి నుంచి మేళతాళాలతో బయలుదేరి తూము సెంటర్ వినాయకుడి గుడి, మెయిన్‌రోడ్డు మీదుగా పళ్లాలమ్మ వారి ఆలయానికి చేరుకున్నారు. ఆలయ ఆసాదులకు గాజులు, నైవేద్యాలు, సారె సమర్పించగా వారు అమ్మవారికి గాజులు అలంకరించారు. ఆలయ ప్రాంగణంలో మహిళలు సామూహి క కుంకుమ పూజలు నిర్వహించారు.

గాజుల సింగారం

గాజుల సింగారం