
ఏపి కానిస్టేబుల్ ఫలితాల్లో డ్రైవర్‌కు స్టేట్స్‌లో 5వ ర
గండేపల్లి: సూరంపాలెం ఆదిత్య విద్యాసంస్థల ట్రాన్స్‌పోర్ట్ విభాగంలో డ్రైవర్‌గా పనిచేస్తున్న గుర్రం రాముడు ఏపీ కానిస్టేబుల్ పరీక్షా ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో 5వ ర్యాంకు సాధించినట్టు ప్రిన్సిపాల్ ఎం.శ్రీనివాసరెడ్డి తెలిపారు. సూరంపాలెం ప్రగతి కళాశాలలో ఇంటర్, డిగ్రీ, కాకినాడ ఆండాళ్లమ్మ కళాశాలలో ఎంబీఏ పూర్తిచేసిన రాముడు ఉద్యోగ ప్రయత్నం చేస్తూనే నాలుగు సంవత్సరాలుగా ఆదిత్యలో డ్రైవర్‌గా పనిచేస్తున్నట్టు పేర్కొన్నారు. తండ్రి రోజువారీ వేతనానికి పనిచేసుకుంటూ కొడుకుని చదివించినట్టు తెలియజేశారు. ఆదిత్య విద్యాసంస్థల చైర్మన్ ఎన్.శేషారెడ్డి, వైస్ చైర్మన్ సతీష్‌రెడ్డి, దీపక్‌రెడ్డి, తదితరులు రాముడుకి అభినందనలు తెలిపారు.