‘నన్నయ’కు వుడ్‌ చిప్పర్‌ | - | Sakshi
Sakshi News home page

‘నన్నయ’కు వుడ్‌ చిప్పర్‌

Jul 30 2025 8:40 AM | Updated on Jul 30 2025 8:40 AM

‘నన్నయ’కు వుడ్‌ చిప్పర్‌

‘నన్నయ’కు వుడ్‌ చిప్పర్‌

రాజానగరం: యూనివర్సిటీ ప్రాంగణాన్ని సుందరీకరించడంలో భాగంగా చెట్ల కొమ్మలు, పొదలు, వ్యర్థాలను చిప్స్‌గా మార్చే మైజో వీమా వుడ్‌ చిప్పర్‌ యంత్రాన్ని ఆదికవి నన్నయ యూనివర్సిటీ కొనుగోలు చేసింది. దీనిని వైస్‌ చాన్సలర్‌ ఆచార్య ఎస్‌.ప్రసన్నశ్రీ మంగళవారం ప్రారంభించారు. ఈ యంత్ర సాయంతో తయారయ్యే వుడ్‌ చిప్స్‌ను మొక్కలకు కంపోస్టు ఎరువుగా వాడవచ్చని ఈ సందర్భంగా ఆమె చెప్పారు. వ్యర్థాలను కాల్చివేయడం వలన పర్యావరణం కలుషితమవుతుందని, ఆవిధంగా కాకుండా ఈ యంత్రం చక్కని ప్రత్యామ్నాయమని అన్నారు. కార్యక్రమంలో ఇన్‌చార్జ్‌ డీన్‌ డాక్టర్‌ బి.జగన్‌మోహన్‌రెడ్డి, కె.దేవలాల్‌, కె.లక్ష్మీపతి, వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement