అనపర్తి: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్జీఎఫ్) ఆధ్వర్యంలో అండర్–14 బాల బాలికల ఉమ్మడి జిల్లా స్థాయి వాలీబాల్ జట్ల ఎంపిక పోటీలు సోమవారం అనపర్తిలోని రామారెడ్డి జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. ఈ పోటీల్లో సుమారు 280 మంది బాలబాలికలు, 60 మంది వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ ఎంపికల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులతో బాలబాలికల జట్లను ఎంపిక చేశారు. ఈ జట్లు ఈ నెల 11 నుంచి 13 వరకు పాడేరులో నిర్వహించే రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీల్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా తరఫున పాల్గొంటాయని సెలెక్షన్స్ ఆర్గనైజింగ్ సెక్రటరీ, బాలుర ఉన్నత పాఠశాల పీడీ టీవీవీఎస్ రాఘవరెడ్డి తెలిపారు.


