● ఎదురెదురుగా బైకుల ఢీ
● వ్యక్తి మృతి, మరొకరికి తీవ్ర గాయాలు
ద్వారకాతిరుమల: దీపావళి పండగ రోజు జరిగిన రోడ్డు ప్రమాదం ఓ కుటుంబంలో విషాదం నింపింది. ఎదురెదురుగా రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన దొరసానిపాడు గ్రామ శివారులో ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తాడేపల్లిగూడేనికి చెందిన పాతల అశోక్, అదే గ్రామానికి చెందిన స్నేహితుడు గొర్రెల కృష్ణప్రసాద్ (47)తో కలిసి ఆదివారం మధ్యాహ్నం 2.50 గంటలకు మోటారు సైకిల్‌పై కామవరపుకోట నుంచి ద్వారకాతిరుమల వైపునకు వెళుతున్నారు. కృష్ణప్రసాద్ బైక్ నడుపుతుండగా అశోక్ వెనుక కూర్చున్నాడు. ఈ క్రమంలో దొరసానిపాడు గ్రామ శివారుకు చేరుకోగానే ద్వారకాతిరుమల నుంచి కామవరపుకోట వైపునకు మరో బైక్‌పై వెళుతున్న జువ్వా నాగేంద్ర అతి వేగంగా వచ్చి వీరిని ఎదురుగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో రోడ్డుపై పడినోయిన కృష్ణ ప్రసాద్, నాగేంద్రలకు తీవ్రంగా, అశోక్‌కు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108లో ఏలూరు ఆశ్రం ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ కృష్ణప్రసాద్ అదే రోజు సాయంత్రం 4.26 గంటలకు మృతి చెందాడు. నాగేంద్ర ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అశోక్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై ఎస్కే అమీర్ తెలిపారు.


