క్రీడా సంబరం.. ఉప్పొంగిన ఉత్సాహం | - | Sakshi
Sakshi News home page

క్రీడా సంబరం.. ఉప్పొంగిన ఉత్సాహం

Nov 10 2026 12:13 AM | Updated on Nov 10 2026 12:13 AM

నాగమల్లితోట జంక్షన్‌(కాకినాడ సిటీ): పాఠశాల క్రీడా సమాఖ్య అండర్‌–19 ఆధ్వర్యంలో సోమవారం కాకినాడ జిల్లా క్రీడా మైదానంలో రైఫిల్‌ షూటింగ్‌ ఎంపికలు ఉత్సాహంగా నిర్వహించారు. ఎస్‌జీఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఎంపికలను డీఎస్‌ఏ రైఫిల్‌ షూటింగ్‌ కోచ్‌ సమీర్‌, కమిటీ సభ్యులు శ్రీహరి, సురేష్‌ రాజు, కొత్తూరు, పీడీ వి.సతీష్‌రాజు, వీటీ కళాశాల పీడీ, రమణరావు పర్యవేక్షించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలో క్రీడాకారులు హాజరుకాగా పిస్టల్‌, పీప్‌, ఓపెన్‌సైట్‌లో 9 మంది బాలురు, 9 మంది బాలికలను రాష్ట్ర స్థాయికి ఎంపిక చేశారు.

ఫ అండర్‌ – 14 బాల బాలికల ఖోఖో, అండర్‌ 14, 17 బాల బాలికల సాఫ్ట్‌ టెన్నిస్‌ ఎంపికలను జిల్లా కార్యదర్శి, పీడీ పి.శ్రీనివాస్‌ ప్రారంభించారు. అనపర్తి బాలుర హైస్కూల్లో వాలీబాల్‌ అండర్‌ – 14, 17 బాల బాలికల ఎంపికలు జరిగాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలో జరిగిన ఈ పోటీలకు 450 మంది హాజరయ్యారు. ఎంపికల నిర్వహణలో అడ్మిన్‌ కార్యదర్శి శేషుకుమారి, పీఈటీ సంఘ కార్యదర్శి మాచరరావు, ఖోఖో సంఘ అధ్యక్షుడు పట్టాభి, కార్యదర్శి ఎం.శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

రైఫిల్‌ షూటింగ్‌లో సత్తా

ప్రకాశం నగర్‌(రాజమహేంద్రవరం): స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ జిల్లా స్థాయి రైఫిల్‌ షూటింగ్‌ పది మీటర్ల విభాగంలో కార్తిక్‌ రామచంద్రరెడ్డి అత్యంత ప్రతిభ కనబరిచి ప్రథమస్థానం సాధించాడు. కాకినాడ డీఎస్‌ ఏ మైదానంలో ఈ పోటీలు జరిగాయి. నగరంలోని గోదావరి పుష్కరాలు ఇండోర్‌ స్టేడియంలో కార్తిక్‌ శిక్షణ పొందుతున్నారు. అండర్‌ 14 బాలుర విభాగంలో ధీర్‌ సాత్విక్‌, బాలికల విభాగంలో ఆకృతి ప్రథమ స్థానాల్లో నిలిచారు. పది మీటర్ల పిస్టల్‌ విభాగంలో జి.నిశాంత్‌ ద్వితీయ, పది మీటర్ల రైఫిల్‌ ఓపెన్‌ సైట్‌ విభాగంలో ఎం. శ్రీరామ్‌ ప్రథమ స్థానంలో నిలిచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement