గల్లంతైన విజయ కుమార్‌ మృతదేహం లభ్యం | - | Sakshi
Sakshi News home page

గల్లంతైన విజయ కుమార్‌ మృతదేహం లభ్యం

Nov 10 2026 12:13 AM | Updated on Nov 10 2026 12:13 AM

దేవరపల్లి: గోపాలపురం మండలం చిట్యాల సమీపంలోని కొవ్వాడ కాలువలో కొట్టుకుపోయిన తాళ్లపూడి మండలం అన్నదేవరపేటకు చెందిన బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా బ్రాంచ్‌ అప్రెజర్‌ విజయకుమార్‌ మృతదేహం శనివారం రాత్రి లభించింది. ఈ నెల 6వ తేదీ సాయంత్రం విజయకుమార్‌, మేనకోడలు పద్య బైక్‌పై దేవరపల్లి వస్తుండగా, వాగు ఉధృతికి కొవ్వాడ కాలువలో కొట్టుకుపోయారు. ఈ ప్రమాదంలో విజయకుమార్‌ బైక్‌తో పాటు కాలువలో గల్లంతు కాగా, పద్మ చెట్టు కొమ్మలను పట్టుకుని ప్రాణాలను దక్కించుకున్న సంగతి తెలిసిందే. అదే రాత్రి ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందం, గ్రామస్తులు విజయకుమార్‌ కోసం గాలించగా, వాతావరణం సహకరించకపోవడంతో తిరిగి వెళ్లిపోయారు. పద్మకు చిట్యాలకు చెందిన వైఎస్సార్‌ సీపీ నాయకుడు, విశ్రాంత ఐఎఫ్‌ఎస్‌ అధికారి పీతల ప్రసాద్‌బాబు ఆశ్రయం కల్పించారు. శనివారం తిరిగి ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందం, గ్రామస్తులు కాలువలో గాలింపు చర్యలు చేపట్టగా, కొట్టుకుపోయిన కొద్ది దూరంలో విజయకుమార్‌ మృతదేహం, బైక్‌ లభ్యమైయింది. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గోపాలపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement