● కౌవ్‌ కేక.. పుంగనూరు ఆవుకు రూ. 5.30 లక్షలు | - | Sakshi
Sakshi News home page

● కౌవ్‌ కేక.. పుంగనూరు ఆవుకు రూ. 5.30 లక్షలు

Nov 10 2026 12:13 AM | Updated on Nov 10 2026 12:13 AM

అంబాజీపేట: పుంగనూరు ఆవుకు రికార్డు స్థాయిలో ధర పలికింది. తమిళనాడుకు చెందిన ఒక వ్యాపార వేత్త ఏకంగా రూ. 5.30 లక్షలకు దాన్ని కొనుగోలు చేశాడు. వివరాలు.. మాచవరానికి చెందిన ఆద్యశ్రీ డెయిరీ ఫాం యజమాని అడబాల ప్రేమకుమార్‌ వద్ద పుంగనూరు ఆవు ఉంది. కార్తిక మాసంలో పరమేశ్వరునికి స్వచ్ఛమైన ఆవుపాలతో అభిషేకం చేసుకోవడం, గోఆధారిత వస్తువులను తయారు చేసుకోవాలనే ఉద్దేశంతో ఆ ఆవును తమిళనాడుకు చెందిన బీవీడీ లిమిటెడ్‌ సంస్థ అధినేత ప్రసాద్‌ రూ.5.30 లక్షలకు కొనుగోలు చేశారు. ప్రేమ్‌కుమార్‌ మాట్లాడుతూ ఆ ఆవు పూటకు మూడు లీటర్ల వంతున పాలు ఇస్తుందని, ఎత్తు కేవలం 36అంగుళాలు (3 అడుగులు) మాత్రమే ఉంటుందన్నారు. తన డెయిరీ ఫాం నుంచి గడిచిన ఆగస్టులో జాతీయ డెయిరీ డెవలప్‌మెంట్‌ బోర్డుకు పుంగనూరు గిత్తను రూ.3.75 లక్షలకు విక్రయించానని తెలిపారు. ఉభయ గోదావరి జిల్లాల్లోనే పుంగనూరు ఆవుకు రూ.5.30 లక్షలకు విక్రయించడం ఇదే ప్రథమమన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement