అన్నవరంలో ఆకాశ దీపం | - | Sakshi
Sakshi News home page

అన్నవరంలో ఆకాశ దీపం

Nov 10 2026 12:13 AM | Updated on Nov 10 2026 12:13 AM

అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని వీర వేంకట సత్యనారాయణస్వామి దేవస్థానంలో కార్తిక మాసోత్సవాలు సోమవారం రాత్రి ఆకాశ దీపం ఏర్పాటుతో ప్రారంభమయ్యాయి. డిసెంబర్‌ ఎనిమిదో తేదీ వరకు ఉత్సవాలు కొనసాగనున్నాయి. గతేడాది సుమారు 20 లక్షల మంది భక్తులు రాగా, 1,34,500 వ్రతాలు నిర్వహించారు. 22 లక్షల ప్రసాదం ప్యాకెట్లు విక్రయించగా రూ.22.5 కోట్ల ఆదాయం సమకూరింది. ఈ ఏడాది 22 లక్షల మంది భక్తులు వస్తారని అంచనాతో ఏర్పాట్లు చేశారు. కార్తిక మాసంలో ప్రతిరోజూ ధ్వజస్తంభం వద్ద ఈ ఆకాశ దీపం ఏర్పాటు చేస్తామని ప్రధాన అర్చకుడు కోట సుబ్రహ్మణ్యం తెలిపారు.

కార్తిక మాసం ప్రారంభం సందర్భంగా అన్నవరంలో సోమవారం రాత్రి ఏర్పాటు చేసిన ఆకాశ దీపం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement