పెళ్లి బాజాలు ఆగకుండానే.. | - | Sakshi
Sakshi News home page

పెళ్లి బాజాలు ఆగకుండానే..

Oct 31 2026 12:07 AM | Updated on Oct 31 2026 12:07 AM

● కారు ప్రమాదంలో వధూవరులతో పాటు ముగ్గురికి గాయాలు

● అన్నవరం వెళ్తుండగా ఘటన

గండేపల్లి: చేయి చేయి పట్టుకుని ఏడడుగులు నడిచారు.. వివాహ బంధంతో ఒక్కటయ్యారు.. ఆ వధూవరులతో బంధువులు దైవ సన్నిధికి బయలుదేరారు.. ఇంతలో అనుకోని ప్రమాదం వారిని గాయాల పాల్జేసింది.. వివాహ జీవితాన్ని సంతోషంగా గడపాల్సిన నూతన వధూవరులు ఆస్పత్రి పాలైన ఘటన గండేపల్లిలో జరిగింది. వధూవరుల ఇళ్లలో పెళ్లి సంబరాలను ఆశ్వాదించాల్సిన కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు గురికావాల్సిన పరిస్థితి నెలకొంది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. రాజమహేంద్రవరం రూరల్‌లోని కోలమూరు గ్రామానికి చెందిన నాగిరెడ్డి రాముతో కోరుకొండ మండలం కణుపూరుకు చెందిన వెంకట తిరుమలేశ్వరికి కణుపూరులో గురువారం రాత్రి వివాహం జరిగింది. ఎంతో అట్టహాసంగా పెళ్లి జరిగింది. తర్వాత దైవ సన్నిధికి వెళ్లి దర్శనం చేసుకోవాలని కారులో అన్నవరం సత్యనారాయణస్వామి ఆలయానికి బయలుదేరారు. వీరి కారు గండేపల్లి శివారు ప్రభుత్వ కార్యాలయాలకు సమీపంలోకి వచ్చే సరికి రోడ్డు పక్కనే డ్రైవర్‌ కాలకృత్యాలు తీర్చుకునేందుకు నిలిపిన మిరపకాయల లోడు తరలిస్తున్న మినీ వ్యాన్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంతో కారులో ప్రయాణిస్తున్న నూతన వధూవరులు నాగిరెడ్డి రాము, వెంకట తిరుమలేశ్వరితో పాటు వరుడి చెల్లి ఆదం దుర్గ, బావ సతీష్‌, వధువు మేనత్త కృష్ణవేణి గాయపడ్డారు. సంఘటనా స్థలానికి చేరుకున్న రోడ్డు సేఫ్టీ అంబులెన్స్‌, 108 అంబులెన్స్‌లో స్థానికుల సహాయంతో క్షతగాత్రులను రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో పెళ్లి కారును సతీష్‌ నడుపుతుండగా, కారులో ఉన్న మరో ఇద్దరు తాళ్లూరి సాయి, అడ్డాల వీరంద్రలకు ఎటువంటి గాయాలు కాలేదు. కునుకు పాట్లు కారణంగానే ప్రమాదం జరిగి ఉండవచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సతీష్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్టు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement