ఇళ్ల నష్టాలపై నివేదికలు ఇవ్వాలి | - | Sakshi
Sakshi News home page

ఇళ్ల నష్టాలపై నివేదికలు ఇవ్వాలి

Oct 31 2026 12:07 AM | Updated on Oct 31 2026 12:07 AM

అమలాపురం రూరల్‌: అర్నబ్‌ తుపానుకు పాక్షికంగా పూర్తిగా దెబ్బతిన్న ఇళ్లు, శిథిలావస్థకు చేరిన పాఠశాల భవనాలను గుర్తించి, వెంటనే నివేదికలు సమర్పించాలని కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌ కుమార్‌ అధికారులను ఆదేశించారు. డీఎల్‌డీఓలు, ఎంపీడీఓలతో కలెక్టరేట్‌ నుంచి శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. తుపాను ప్రభావంతో రోడ్లపై కూలిన చెట్ల తొలగింపు, విద్యుత్‌ పునరుద్ధరణ, సహాయక చర్యలు వంటి అంశాలపై సమీక్షించారు. శిథిలావస్థలో ఉన్న పాఠశాల భవనాలకు మరమ్మతులు చేసిన తరువాత మాత్రమే విద్యార్థులను అనుమతించాలని స్పష్టం చేశారు.

గ్యాస్‌ సిలిండర్ల ఓటీపీ నుంచి

తాత్కాలిక మినహాయింపు

అమలాపురం రూరల్‌: తుపాను కారణంగా విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడం మొబైల్‌ నెట్‌వర్క్‌, ఇంటర్నెట్‌ కనెక్టివిటీలో సమస్యలను దృష్టిలో ఉంచుకొని జిల్లాలో వంట గ్యాస్‌ సిలిండర్ల పంపిణీకి ఓటీపీ ఆధారిత ధ్రువీకరణ నుంచి తాత్కాలిక మినహాయింపు ఇచ్చారు. నగదు చెల్లింపు ద్వారా నేరుగా సిలిండర్లు పొందే విధానాన్ని అమలు చేయడానికి పెట్రోలియం సహజవాయువుల మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపిందని కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌ కుమార్‌ తెలిపారు. తదుపరి ఉత్తర్వులు జారీ చేసేంత వరకూ ఈ వెసులుబాటు అమలు ఉంటుందన్నారు.

MýSÌñæ-MýSt-Æó‡-sŒæÌZ ˘

మొబైల్‌ టవర్‌ ఏర్పాటు

అమలాపురం రూరల్‌: తుపానుకు ఎయిర్‌టెల్‌ టవర్లు పాడవడంతో కలెక్టరేట్‌లో సెల్‌ఫోన్లు, ఇంటర్నెట్‌ సక్రమంగా పని చేయడం లేదు. అధికారులకు సరిగ్గా సమాచారం అందడం లేదు. ఈ నేపథ్యంలో కలెక్టర్‌ మహేష్‌ కుమార్‌ ఎయిర్‌టెల్‌ మేనేజర్‌తో మాట్లాడి, హైదరాబాద్‌ నుంచి మొబైల్‌ సెల్‌ టవర్‌ తీసుకొచ్చి కలెక్టరేట్‌లో ఏర్పాటు చేయిస్తున్నారు. దీని ద్వారా 5 కిలోమీటర్ల పరిధిలో సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ అందుతాయని అధికారులు తెలిపారు. ఇది శనివారం నుంచి అందుబాటులోకి వస్తుంది.

నేడు కేంద్ర బృందం రాక

అమలాపురం రూరల్‌: అర్నబ్‌ తుపాను వలన జరిగిన నష్టాన్ని పరిశీలించేందుకు కేంద్ర బృందం శనివారం జిల్లాకు రానున్నదని కలెక్టర్‌ మహేష్‌ కుమార్‌ తెలిపారు. సంబంధిత శాఖల జిల్లా అధికారులతో కలెక్టరేట్‌లో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నష్టాల వివరాలను కేంద్ర బృందానికి సమగ్రంగా అందించాలని సూచించారు. తుపానుకు జిల్లాలో దెబ్బ తిన్న ఇళ్లు, పంటలు, ఇతర శాఖలకు జరిగిన నష్టాలను కేంద్ర బృందం క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తుందన్నారు. ఆయా శాఖల అధికారులు నష్టాల వివరాలను పూర్తి స్థాయిలో సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement