కాట్రేనికోన: మాజీ జెడ్పీటీసీ పాలెపు లక్ష్మి భర్త ధర్మారావు కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పి సోమవారం వైఎస్సార్ సీపీలో చేరారు. ఆ పార్టీ ముమ్మిడివరం నియోజకవర్గ కో ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ సమక్షంలో వైఎస్సార్ సీపీకి జైకొట్టారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ధర్మారావు కాంగ్రెస్ పార్టీ నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేశారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం హయాంలో నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధికి ఆకర్షితుడినై పొన్నాడ నాయకత్వంలో పని చేసేందుకు పార్టీలో చేరానని ధర్మారావు చెప్పారు. కార్యక్రమంలో పార్టీ సీఈసీ సభ్యుడు పితాని బాలకృష్ణ, నియోజకవర్గ పరిశీలకుడు చెల్లుబోయిన శ్రీనివాస్, నాయకులు యేడిది సుబ్బారావు, కోలాటి సత్యం, కాశి హనుమంతరావు, వల్లభుని దొరబాబు తదితరులు పాల్గొన్నారు.


