అమలాపురం రూరల్: స్థానిక సంస్థల ఎన్నికల్లో ధన ప్రభావం, ప్రలోభాలను అరికట్టాలని జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకుడు శివకుమార్ గంగాల్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అభ్యర్థుల ఎన్నికల ఖర్చులపై నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. ఫ్లయింగ్ స్క్వాడ్‌లు, స్టాటిక్ సర్వైలెన్స్ బృందాలు, ఇతర ఎన్నికల వ్యయ పర్యవేక్షణ బృందాలు పరస్పర సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. ఎన్నికల వ్యయ పరిమితులు, నిబంధనలపై అభ్యర్థులకు అవగాహన కల్పించాలని అన్నారు. సమావేశంలో జిల్లా ఆడిట్ అధికారి, జిల్లా ఎన్నికల వ్యయ పర్యవేక్షణ అధికారి ఏవీవీ సత్యనారాయణ, సీనియర్ ఆడిటర్లు సీహెచ్ మురళీకృష్ణ, ఆర్.భీమేశ్వరరావు పాల్గొన్నారు.


