మన నాటకం.. నిత్యనూతనం | - | Sakshi
Sakshi News home page

మన నాటకం.. నిత్యనూతనం

Oct 23 2026 12:21 AM | Updated on Oct 23 2026 12:21 AM

సీటీఆర్‌ఐ(రాజమహేంద్రవరం): సినిమాలు వచ్చాక నాటకం పనైపోయిందన్నారు.. టీవీలు వచ్చాక నాటకాలు కనిపించవన్నారు.. ఓటీటీలతో నాటకం కనుమరుగవుతుందన్నారు.. పండగల వేళ వేదికలపై ప్రదర్శిస్తున్న నాటకాలకు ఈలలు, చప్పట్లు చూస్తుంటే అవన్నీ వట్టి మాటలేనని తేలిపోయింది. శరన్నవరాత్ర ఉత్సవాల సందర్భంగా స్థానిక దేవీచౌక్‌లోని వేదికపై 93 ఏళ్లుగా సాగుతున్న నాటకాలను చూడడానికి వచ్చే కళా ప్రియులు నాటకం అజరామరమని తేల్చి చెబుతున్నారు. ప్రత్యేకించి పౌరాణిక నాటకాలకువారి ఆదరణ అంతా ఇంతా కాదు.

ఎంతో ప్రాధాన్యం

గతంలో నాటకాలు ప్రజలకు ఒక ఊరట. కళ్లముందు స్పెషల్‌ ఎఫెక్ట్స్‌తో, రాగయుక్తమైన పద్యాలతో కళాకారులు నటిస్తుంటే ప్రేక్షకులు మైమరచిపోయేవారు. స్థానిక దేవీచౌక్‌లో దేవి నవరాత్రుల సందర్భంగా ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసిన నాటకాలను చూడడానికి జనం తండోపతండాలుగా వచ్చేవారు. రాత్రి ప్రదర్శించే నాటకాన్ని తిలకించడానికి జనంతో పాటు సినీతారలు సైతం వచ్చి తిలకిస్తూ సామాన్య ప్రేక్షకుల్లా చప్పట్లు కొట్టి కళాకారులను ప్రోత్సహించేవారు.

రాష్ట్ర వ్యాప్తంగా ప్రసిద్ధి

ఇక్కడ ప్రదర్శించే నాటకాలకు రాష్ట్ర వ్యాప్తంగా పేరు రావడంతో ఒక్కసారైనా ఈ వేదికపై నటించాలని ప్రతి కళాకారుడు ఉవ్విళ్లూరేవారు. శ్రీరామాంజనేయ యుద్ధం, శ్రీకృష్ణ తులాభారం, చింతామణి, బొబ్బిలి యుధ్దం, మహాకవి కాళిదాసు, సత్యహరిశ్చంద్ర, గయోపాఖ్యానం, బాలనాగమ్మ, కురుక్షేత్రం వంటి నాటకాలలో ప్రసిద్ధి చెందిన రంగస్థల నటులు నటించారు. సురభి వారు ప్రదర్శించే నాటకాలలో ఫైర్‌సెట్టింగ్‌కూ పెద్ద పేరు ఉండేది. వారి నాటకాలలో భారీ సెట్టింగ్‌లు ఎంతో ఆకట్టుకునేవి.

● ఎన్ని మాధ్యమాలు వచ్చినా చెదరని కళారంగం

● దేవీచౌక్‌లో 93 ఏళ్లుగా నాటక ప్రదర్శనలు

● వీక్షించేందుకు పోటెత్తుతున్న కళాభిమానులు

● ఇక్కడి వేదికపై నటించడం ఎందరికో కల

● ఎందరో కళాకారులకు ఇష్టమైన వేదిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement