● మహాలక్ష్మీ వైభవం | - | Sakshi
Sakshi News home page

● మహాలక్ష్మీ వైభవం

Oct 18 2026 12:30 AM | Updated on Oct 18 2026 12:30 AM

రూ.10 లక్షలతో అలంకరణ

దసరా మహోత్సవాల సందర్భంగా బొమ్మూరు – రాజవోలు రోడ్డులోని దుర్గామల్లేశ్వరస్వామి దేవాలయంలో అమ్మవారిని శనివారం రూ.10 లక్షల కొత్త నోట్లతో మహాలక్ష్మీదేవిగా అలంకరించారు. ధర్మకర్తలు కుడిపూడి శ్రీనుబాబు, లక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో రూ.500, రూ.200, రూ.100, రూ.50 నోట్లతో అలంకరణ చేశారు.

– రాజమహేంద్రవరం రూరల్‌

రూ.6.50 లక్షల నోట్లతో..

పాశర్లపూడిలంక సుబ్బారాయుడు వీధిలో కొలువైన నవబాల కనకదుర్గ అమ్మవారిని శనివారం మహాలక్ష్మీదేవిగా అలంకరించారు. అమ్మవారితో పాటు ఆలయ ప్రాంగణాన్ని రూ.6,50,001 నోట్ల కరెన్సీ నోట్లతో శోభాయమానంగా అలంకరించారు. పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు.

– మామిడికుదురు

కోటి కాంతులు

శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రావులపాలెంలోని కేఎస్‌ఆర్‌ కాంప్లెక్స్‌లో అమ్మవారితో పాటు మండపాన్ని శనివారం రూ.కోటితో అలంకరించారు. ఒక్క రూపాయి నుంచి 10, 20, 50, 100 రూపాయల నోట్లు వినియోగించారు. మహాలక్ష్మి అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావచ్చారు.

– రావులపాలెం

అన్నవరంలోని రత్నగిరిపై కొలువైన వనదుర్గమ్మను శనివారం సరస్వతీ దేవిగా అలంకరించి, పూజలు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు.

– అన్నవరం

ద్రాక్షారామ మాణిక్యాంబా సమేత భీమేశ్వరస్వామి ఆలయంలోని వసంత మండపంలో ప్రత్యేకంగా సిద్ధం చేసిన అమ్మవారి మట్టి ప్రతిమను శనివారం మహాలక్ష్మీదేవిగా అలంకరించారు.

– రామచంద్రపురం రూరల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement