భక్తవత్సలా.. నిత్యనిర్మలా.. | - | Sakshi
Sakshi News home page

భక్తవత్సలా.. నిత్యనిర్మలా..

Oct 18 2026 12:30 AM | Updated on Oct 18 2026 12:30 AM

● వాడపల్లిలో మార్మోగిన

గోవిందనామ స్మరణ

● భారీగా తరలివచ్చిన భక్తులు

ఆత్రేయపురం: కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన వాడపల్లి వేంకటేశ్వరస్వామివారి దర్శనానికి శనివారం భక్తులు భారీగా తరలివచ్చారు. భక్తుల గోవింద నామ స్మరణతో మాడ వీధులు మార్మోగాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు తెల్లవారుజామునే గౌతమీ గోదావరిలో స్నానాలు ఆచరించి, క్యూలో నిలబడి స్వామిని దర్శించుకున్నారు. చాలామంది కాలినడకన ఆలయానికి విచ్చేశారు. స్వామికి అర్చకులు వేకువజామునే ప్రత్యేక అభిషేకాలు, పూజలు జరిపారు. అనంతరం స్వామివారిని పలు రకాల పూలు, పండ్లతో అలంకరించారు. ఆలయ ఆవరణలోని క్షేత్రపాలకుడు అన్నపూర్ణ సమేత విశ్వేశ్వరస్వామిని భక్తులు దర్శించారు. వకుళామాత అన్నదాన భవనంలో స్వామివారి అన్న ప్రసాదం స్వీకరించారు. భక్తులకు ఇబ్బంది లేకుండా ఆలయ ఈవో, దేవదాయశాఖ ఉప కమిషనర్‌ నల్లం సూర్యచక్రధరరావు, ఆలయ సిబ్బంది ఏర్పాట్లను పర్యవేక్షించారు. కాగా.. స్వామి వారిని 85,247 మంది భక్తులు దర్శించుకున్నారు. దేవస్థానానికి రూ.49,45,444 ఆదాయం సమకూరింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement