రవాణా సేవలకు దళారులను ఆశ్రయించొద్దు | - | Sakshi
Sakshi News home page

రవాణా సేవలకు దళారులను ఆశ్రయించొద్దు

Oct 18 2026 12:30 AM | Updated on Oct 18 2026 12:30 AM

కంబాలచెరువు(రాజమహేంద్రవరం): రవాణా శాఖలో సేవలకు వాహన్‌ సారథి పోర్టల్‌ను వినియోగించుకోవాలని, దళారులను ఆశ్రయించొద్దని జిల్లా రవాణాశాఖ అధికారి ఆర్‌.సురేష్‌ అన్నారు. లైసెన్సులకు దళారులు అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారంటూ ఈ నెల 16న సాక్షి దినపత్రికలో డబ్బు కొట్టు.. లైసెన్స్‌ పట్టు శీర్షికన వచ్చిన కథనానికి ఆయన స్పందించారు. ఈ మేరకు శనివారం ప్రకటన విడుదల చేశారు. వాహన యాజమాన్య హక్కుల బదిలీ, ఫైనాన్స్‌ నోటింగ్‌, ఫైనాన్స్‌ టెర్మినేషన్‌ వంటి వాహన సంబంధిత సేవలతో పాటు, లెర్నర్‌ లైసెన్స్‌ (ఎల్‌ఎల్‌ఆర్‌), డ్రైవింగ్‌ లైసెన్స్‌ పునరుద్ధరణ, చిరునామా మార్పు తదితర సేవలకు అధికారిక పోర్టల్‌ను ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఆన్‌లైన్‌ సేవల ఆమోద ప్రక్రియలో తాత్కాలికంగా ఆలస్యం జరుగుతున్నందున, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా రాజమహేంద్రవరం రవాణా శాఖ కార్యాలయంలో సంబంధిత సేవలకు ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించామన్నారు. పర్మినెంట్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌కు మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ పర్యవేక్షణలో మాన్యువల్‌ డ్రైవింగ్‌ ట్రాక్‌ పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. ఉత్తీర్ణులైన అభ్యర్థులకు నిబంధనల ప్రకారం లైసెన్స్‌ జారీ చేస్తామని, ఉత్తీర్ణత సాధించనివారు తిరిగి స్లాట్‌ బుక్‌ చేసుకొని పరీక్షకు హాజరుకావాలన్నారు. రవాణా శాఖ సేవలను ప్రజలు అధికారిక ఆన్‌లైన్‌ పోర్టల్‌ లేదా సమీపంలోని మీ సేవ, కామన్‌ సర్వీస్‌ సెంటర్ల (సీఎస్‌సీ) ద్వారా పొందాలన్నారు. ప్రభుత్వ నిర్ణీత రుసుములు మాత్రమే చెల్లించాలని, కార్యాలయం పేరుతో అదనపు మొత్తాలు వసూలు చేసే మధ్యవర్తులు, దళారులను నమ్మి మోసపోవద్దన్నారు. సేవలు పొందడంలో ఏవైనా సమస్యలు ఎదురైనా, సందేహాలున్నా, వేధింపులకు గురైనా నేరుగా జిల్లా రవాణా శాఖాధికారి నంబర్‌ 92816 07020ను సంప్రదించాలన్నారు.

కాకినాడలో హాకీ సంబరం

నాగమల్లితోట జంక్షన్‌ (కాకినాడ సిటీ): హాకీ ఇండియా సహకారంతో కోకనాడ కోస్టర్‌ స్పోర్ట్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో జరిగే ఖేలో ఇండియా మహిళా సౌత్‌ జోన్‌ హాకీ పోటీలకు కాకినాడ వేదిక కానుంది. ఈ నెల 27 నుంచి నవంబరు 6 వరకు జరిగే ఈ పోటీల్లో ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, పాండిచ్చేరి, కోకనాడ కోస్టర్‌ స్పోర్ట్స్‌ క్లబ్‌, ఆడిటి అనంతపురం జట్లు పాల్గొంటున్నాయి. తొలిసారి ఈ పోటీలు కాకినాడలో జరుగుతుండడంతో నిర్వాహకులు వివిధ కమిటీలను ఏర్పాట చేసి నిర్వహణ ఏర్పాట్లు మొదలు పెట్టారు. పోటీల నిర్వహణ కమిటీ చీఫ్‌ ప్యాట్రన్‌గా ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, నిర్వహణ కార్యదర్శిగా ఒలింపియన్‌ రజని, కమిటీ ఉపాధ్యక్షురాలిగా సుధారాణి వ్యవహరిస్తున్నారు. సబ్‌ జూనియర్స్‌, జూనియర్స్‌ విభాగంలో ప్రతి రోజు నాలుగు మ్యాచ్‌లు నిర్వహిస్తారు. 30 మంది సాంకేతినిక నిపుణులు, 70 లోకల్‌ ఆఫీషియల్స్‌ పోటీల నిర్వహణ ఏర్పాట్లలో విధులు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా కోకనాడ కోస్టర్‌ స్పోర్ట్స్‌ క్లబ్‌ వ్యవస్థాపకుడు రవిచంద్ర శనివారం డీఎస్‌ఏలో విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ కోకనాడ కోస్టర్‌ స్పోర్ట్స్‌ క్లబ్‌ ఇటీవల హైదరాబాద్‌లో డిపార్డ్‌మెంట్‌ హాకీ పోటీలు నిర్వహించిందన్నారు. హాకీ ఇండియాలో ఆఫిలియేటెడ్‌ క్లబ్‌ కావడంతో హాకీ ఇండియా ఈ టోర్నమెంట్‌ నిర్వహణను కోకనాడ కోస్టర్‌ స్పోర్ట్స్‌ క్లబ్‌కు కేటాయించిందన్నారు. వుమెన్‌ ఎంపవర్‌మెండ్‌, మహిళా క్రీడాకారిణులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మినిస్టర్‌ ఆఫ్‌ యూత్‌ ఎఫైర్స్‌ పర్యవేక్షణలో గవర్నమెంట్‌ ఆఫ్‌ ఇండియా ఈ పోటీలు నిర్వహిస్తుందన్నారు. సమావేశంలో కోకనాడ కోస్టర్‌ స్పోర్ట్స్‌ క్లబ్‌ ప్రతినిధులు బాబ్జీ, సుధారాణి, సూరిబాబు, రాజు పాల్గొన్నారు.

● నిర్ణీత రుసుములనే చెల్లించాలి

● జిల్లా రవాణాశాఖాధికారి సురేష్‌

27 నుంచి ఖేలో ఇండియా

మహిళా సౌత్‌ జోన్‌ పోటీలు

5 రాష్ట్రాల నుంచి క్రీడాకారుల హాజరు

కోకనాడ కోస్టర్‌ స్పోర్ట్స్‌ క్లబ్‌కు

నిర్వహణ బాధ్యతలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement