రెండో రోజు.. 53 నామినేషన్ల దాఖలు | - | Sakshi
Sakshi News home page

రెండో రోజు.. 53 నామినేషన్ల దాఖలు

Oct 18 2026 12:30 AM | Updated on Oct 18 2026 12:30 AM

అమలాపురం టౌన్‌: అమలాపురం మున్సిపల్‌ కార్యాలయంలో రెండో రోజు శనివారం వివిధ పార్టీల నుంచి వార్డు అభ్యర్థులుగా మొత్తం 53 నామినేషన్లు దాఖలయ్యాయి. డమ్మీ నామినేషన్లతో కలుపుకొని ఈ నామినేషన్లు వచ్చాయి. రెండో రోజు కూడా చైర్‌పర్సన్‌ అభ్యర్థులుగా ఎవరూ నామినేషన్‌ వేయలేదు. వార్డు అభ్యర్థులుగా వైఎస్సార్‌ సీపీ నుంచి 15, టీడీపీ నుంచి 25, జనసేన నుంచి 9, బీజేపీ నుంచి 2, స్వతంత్రులుగా ఇద్దరు నామినేషన్లు దాఖలు చేశారు. వైఎస్సార్‌ సీపీ నుంచి విత్తనాల మూర్తి (వార్డు–5), బండారు సత్యనారాయణ (వార్డు–32), కముజు లక్ష్మి (వార్డు–35), చిత్రపు శ్యామల (వార్డు–34), త్సవటపల్లి ఏడుకొండలు (వార్డు–22), కుసుమ మంగతాయారు (వార్డు–36), యండమూరి గంగ(వార్డు–30), ఇళ్ల కిషోర్‌ (వార్డు–29) తదితరులు నామినేషన్లు వేశారు.

మొరాయించిన కంప్యూటర్లు

మున్సిపల్‌ అకౌంట్‌ విభాగంలో కంప్యూటర్లు మొరాయించడంతో గంటన్నర సేపు నామినేషన్లకు సంబంధించి చెల్లించే చలానాలు నిలిచిపోయాయి. నామినేషన్ల దాఖలుకు గడువు సాయంత్రం 3 గంటలకు ముగియడంతో లోపలకు అభ్యర్థులను పోలీసులు అనుమతించలేదు. తాము 3 గంటలకు ముందే మున్సిపల్‌ ప్రాంగణంలోకి వచ్చినా పోలీసులు అనుమతించలేదని ఇద్దరు అభ్యర్థులు వాపోయారు. ఈ క్రమంలో పోలీసులు, కొంత మంది టీడీపీ నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది.

జిల్లా ఎలక్షన్‌ అబ్జర్వర్‌ పరిశీలన

అమలాపురం మున్సిపల్‌ కార్యాలయంలో నామినేషన్ల ప్రక్రియను జిల్లా ఎలక్షన్‌ అబ్జర్వర్‌ పి.ప్రశాంతి పరిశీలించారు. ఆమె జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ వైఖోం నైదియాదేవి, ఆర్డీఓ సరళావతి, అమలాపురం మున్సిపల్‌ కమిషనర్‌ వి.నిర్మల్‌కుమార్‌తో కలసి నామినేషన్ల స్వీకరిస్తున్న అధికారులను నామినేషన్ల ప్రక్రియపై పలు ప్రశ్నలు వేశారు. ఎన్నికల నియమావళికి అనుగుణంగా నామినేషన్లు స్వీకరిస్తున్నారా...? అని ఎన్నికల అధికారులను అడిగారు.

5వ వార్డుకు వైఎస్సార్‌ సీపీ అభ్యర్థిగా

నామినేషన్‌ దాఖలు చేస్తున్న విత్తనాల మూర్తి

32వ వార్డుకు వైఎస్సార్‌ సీపీ అభ్యర్థిగా

నామినేషన్‌ వేస్తున్న బండారు సత్యనారాయణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement