వైఎస్సార్‌ సీపీకి పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధం | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ సీపీకి పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధం

Oct 16 2026 12:06 AM | Updated on Oct 16 2026 12:06 AM

● ‘స్థానిక’ ఎన్నికల్లో బలమైన

అభ్యర్థులను బరిలో దింపాలి

● పార్టీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి

● అమలాపురంలో

ముఖ్య నాయకుల సమావేశం

అమలాపురం రూరల్‌: కూటమి ప్రభుత్వ 28 నెలల పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు, కొత్తపేట మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. చంద్రబాబు పాలనపై ప్రజల్లో నమ్మకం లేకపోవడంతో, స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీకి పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. స్థానిక ఎన్నికలపై వైఎస్సార్‌ సీపీ అనుసరించాల్సిన వ్యూహాలు, క్షేత్రస్థాయిలో నాయకులు, కార్యకర్తల సమన్వయం తదితర కీలక అంశాలపై జిల్లాలోని పార్టీ ముఖ్య నాయకులతో నిర్వహించిన సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. భట్నవెల్లిలోని మాజీ మంత్రి, పార్టీ పీఏసీ సభ్యుడు, పార్లమెంటరీ కో ఆర్డినేటర్‌ పినిపే విశ్వరూప్‌ క్యాంపు కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. ఈ ఎన్నికల్లో పార్టీ విజయానికి అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రజా సమస్యలపై పోరాటాలు, ప్రజల్లో పార్టీకి మరింత ఆదరణ పెంపొందించే విధంగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితులు, నాయకులు, కార్యకర్తల బాధ్యతలపై జగ్గిరెడ్డి చర్చించారు. ఆయన మాట్లాడుతూ, సర్పంచ్‌, వార్డులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్‌ చైర్మన్‌, వార్డులతో పాటు జిల్లా పరిషత్‌ చైర్మన్‌ స్థానాలకు బలమైన అభ్యర్థులను బరిలో దింపాలని సూచించారు. జిల్లాలోని నాలుగు ఎస్సీ జెడ్పీటీసీ స్థానాల్లో బలమైన అభ్యర్థులను పోటీలో నిలపాలన్నారు. హామీల అమలులో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైన విషయాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు.

ఎమ్మెల్సీలు కుడుపూడి సూర్యనారాయణరావు, బొమ్మి ఇజ్రాయిల్‌ మాట్లాడుతూ, అమలాపురంలో పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసి, స్థానిక ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని అన్నారు. మాజీ మంత్రులు పిల్లి సుభాష్‌చంద్రబోస్‌, పినిపే విశ్వరూప్‌ మాట్లాడుతూ, నియోజకవర్గ కో ఆర్టినేటర్లు నాయకులు, కార్యకర్తలతో క్షేత్ర స్థాయిలో సమన్వయం చేసి, గెలుపే లక్ష్యంగా పని చేయాలని సూచించారు. అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకులు జక్కంపూడి విజయలక్ష్మి, మాజీ ఎంపీ చింతా అనురాధ, అసెంబ్లీ నియోజకవర్గాల కో ఆర్డినేటర్లు పొన్నాడ వెంకట సతీష్‌ కుమార్‌ (ముమ్మిడివరం), పినిపే శ్రీకాంత్‌ (అమలాపురం), పాముల రాజేశ్వరీదేవి (రాజోలు), గన్నవరపు శ్రీనివాసరావు (పి.గన్నవరం) మాట్లాడుతూ, స్థానిక ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా, ప్రజాస్వామ్యబద్ధంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ కలెక్టర్‌ ఎస్పీలకు వినతిపత్రాలు ఇవ్వాలని సూచించారు. మత్స్యకార గ్రామాల్లో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జిన్నూరి రామారావు (బాబీ), సీఈసీ సభ్యుడు పితాని బాలకృష్ణ, ఎస్‌ఈసీ సభ్యులు పీకే రావు, కుడుపూడి భరత్‌ భూషణం, కాశి మునికుమారి, కుడుపూడి వెంకటేశ్వరబాబు, సాకా మణికుమారి, తోరం భాస్కరరావు, రాష్ట్ర కార్యదర్శులు చెల్లుబోయిన శ్రీనివాసరావు, ఇందుకూరి సూర్యనారాయణరాజు, దంగేటి రాంబాబు, జక్కంపూడి వాసు, చింతలపాటి శ్రీనివాసరాజు, పాటి శివ, కర్రి నాగిరెడ్డి, గంధం రవి, గొల్లపల్లి డేవిడ్‌రాజు, కటకంశెట్టి ఆదిత్య, జిల్లా అధికారి ప్రతినిధి తేన్నిటి కిషోర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement