●
సాక్షి, రాజమహేంద్రవరం/రాజమహేంద్రవరం రూరల్: రాష్ట్రంలోని బలహీన వర్గాల అసలైన ఆత్మబంధువు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డేనని వైఎస్సార్ సీపీ బీసీ నాయకులు ముక్త కంఠంతో నినదించారు. 139 బీసీ కులాల కోసం 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన ఘనత ఆయకే దక్కుతుందని కొనియాడారు. వెన్నుపోటు పార్టీ వంచనపై బీసీ గర్జన పేరిట రౌండ్‌టేబుల్ సమావేశాన్ని వైఎస్సార్ సీపీ బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ రాచపల్లి రమేష్‌యాదవ్ అధ్యక్షతన, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆధ్వర్యంలో బొమ్మూరులోని పార్టీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించారు. బీసీలకు కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అన్యాయాన్ని ఎండగడుతూ జగన్ ప్రభుత్వంలో జరిగిన మేలును వారంతా గుర్తు చేసుకున్నారు. పార్టీ నాయకులతో పాటు ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, సీఈసీ సభ్యుడు పితాని బాలకృష్ణ, బీసీ సెల్ ఏలూరు జిల్లా అధ్యక్షుడు నెరుసు చిరంజీవులు, ప్రధాన కార్యదర్శి మరడ అనిల్‌కుమార్, రాష్ట్ర కార్యదర్శి గంధం రవి, చందన నాగేశ్వర్ తదితరులు మాట్లాడారు.
శెట్టిబలిజలకు
సముచిత స్థానం
శెట్టిబలిజలకు జగన్ సముచిత స్థానం కల్పించారు. పిల్లి సుభాష్‌చంద్రబోస్‌కు ఉప ముఖ్యమంత్రితో పాటు, రాజ్యసభకు పంపించారు. చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణను మంత్రిని చేశారు. జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అయితేనే బడుగు, బలహీనవర్గాలకు న్యాయం జరుగుతుంది.
– చెల్లుబోయిన శ్రీనివాస్,
మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్,
అమలాపురం
సమన్వయం సాధించాలి
బీసీల మధ్య సమన్వయం సాధించినప్పుడే ఐక్యత సాధించగలం. ఏ బీసీకి కష్టమొచ్చినా అందరూ అండగా నిలవాలి. ఆ దిశగా అవసరమైన కార్యాచరణ చేపట్టాలి.
– గూడూరి శ్రీనివాస్,
వైఎస్సార్ సీపీ పార్లమెంట్ ఇన్‌చార్జి, రాజమహేంద్రవరం
జగన్‌తోనే గౌరవం
బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 45 శాతం పైగా రిజర్వేషన్లు కల్పించడంతో పాటు కార్పొరేషన్ పదవులు ఇచ్చి గౌరవం కల్పించింది వైఎస్ జగన్. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ జెండా ఎగురవేద్దాం.
– అల్లి రాజబాబు, వైఎస్సార్ సీపీ బీసీ సెల్ అధ్యక్షుడు, కాకినాడ జిల్లా
బీసీలను మోసగించిన చంద్రబాబు
ఎన్నికల సమయంలో బూటకపు హామీలిచ్చిన చంద్రబాబు గద్దెనెక్కిన తర్వాత బీసీలకు వెన్నుపోటు పొడిచారు. చంద్రబాబు మోసాలను ప్రతి ఒక్కరూ క్షేత్ర స్థాయిలోకి తీసుకెళ్లాలి.
– కొండపల్లి దుర్గారావు,
వైఎస్సార్ సీపీ బీసీ సెల్ అధ్యక్షుడు, తూర్పు గోదావరి జిల్లా
చంద్రబాబు మోసాలు ఎండగట్టాలి
చంద్రబాబు బీసీలకు 50 ఏళ్లకే పింఛన్ ఇస్తానంటూ హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక వంచించారు. బీసీ సోదరులందరూ చంద్రబాబు మోసాలను ప్రజలకు వివరించాలి.
– మట్టా నాగేంద్ర,
వైఎస్సార్ సీపీ బీసీ సెల్ అధ్యక్షుడు, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా
జగన్ సీఎం అయితేనే
బీసీలకు రాజ్యాధికారం
ఆయన పాలనలోనే
బలహీన వర్గాలకు లబ్ధి
45 శాతం పైగా సీట్లు కేటాయించిన ఘనత ఆయనదే
మహిళలకు 50 శాతం
పదవులు ఇప్పించారు
రెండేళ్లుగా బీసీలకు చంద్రబాబు వెన్నుపోటు
ఒక్కరికీ ‘ఉప ముఖ్యమంత్రి’ ఇవ్వలేదు
రాజ్యసభ, ఎమ్మెల్సీల నియామకంలోనూ అన్యాయం
ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల బీసీ గర్జనలో వైఎస్సార్ సీపీ నేతలు


