డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ | - | Sakshi
Sakshi News home page

డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ

Sep 14 2026 12:14 AM | Updated on Sep 14 2026 12:14 AM

లో

న్యూస్‌రీల్‌

సోమవారం శ్రీ 14 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2026

కడలిలోకి 1.70 లక్షల క్యూసెక్కులు

ధవళేశ్వరం: కాటన్‌ బ్యారేజ్‌ నుంచి ఆదివారం 1,70,849 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేశారు. గోదావరి డెల్టా కాలువలకు 13,200 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఇందులో తూర్పు డెల్టాకు 4,700, మధ్య డెల్టాకు 1,500, పశ్చిమ డెల్టాకు 7 వేల క్యూసెక్కుల నీటిని వదిలారు.

బాలలు ఇన్‌స్పైర్‌ చేశారు

విద్యార్థుల మేధకు పదును పెట్టే లక్ష్యంతో జాతీయ స్థాయిలో ఏటా నిర్వహించే ‘ఇన్‌స్పైర్‌’ పోటీల్లో జిల్లా విద్యార్థులు ప్రతిభ చూపారు.

వెన్నుపోటు పార్టీ మోసాలు ఎండగట్టాలి

వెన్నుపోటు పార్టీ నాయకుడు చంద్రబాబు బూటకపు హామీలతో అధికారంలోకి వచ్చి బీసీలను మోసం చేశారు. చంద్రబాబు మోసాలను క్షేత్రస్థాయిలోకి తీసుకు వెళ్లాలి. బీసీల సమస్యలను తమకు తెలియజేస్తే పార్టీ అధినేత జగన్‌ దృష్టికి తీసుకెళ్తాం.

– నవుడు వెంకటరమణ,

వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర బీసీ సెల్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌,

జోన్‌ 2 రీజినల్‌ అధ్యక్షుడు

బీసీలను విస్మరించిన ప్రభుత్వం

చంద్రబాబు సర్కారు బీసీలను విస్మరించిందన్న విషయాన్ని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలి. జగనన్న చేయూత పథకం ద్వారా 26 లక్షల మందికి రూ.18 వేలు చొప్పున అందజేశారు. చంద్రబాబు అబద్ధపు హామీతో ఏడాదికి రూ.48 వేలు వస్తాయని ఆశించి 26 లక్షల కుటుంబాలు మోసపోయాయి. 27న బీసీ గర్జనను విజయవంతం చేసుకుంటే స్థానిక ఎన్నికల్లోనూ ప్రభావం కనిపిస్తుంది. – మార్గాని భరత్‌రామ్‌,

మాజీ ఎంపీ, వైఎస్సార్‌ సీపీ జాతీయ అధికార ప్రతినిధి

తూర్పు కాపులకు వైఎస్సార్‌తో మేలు

తూర్పు కాపులకు ఉత్తరాంధ్ర మినహా ఇతర ప్రాంతాల్లో బీసీ సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని వైఎస్సార్‌ వద్దకు వెళ్తే వెంటనే ఒక జీవో జారీ చేయించారు. ఎక్కడున్నా తూర్పు కాపులేనని, వారికి బీసీ సర్టిఫికెట్లు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. 27వ తేదీన జరిగే సభలో తూర్పు కాపులను ఓబీసీలో చేరుస్తామన్న భరోసా కల్పించాలి.

– రౌతు సూర్యప్రకాశరావు, మాజీ ఎమ్మెల్యే,

రాజమహేంద్రవరం

బీసీలను ఏకం చేయాలి

బీసీలను ఏకం చేయాల్సిన అవసరం ఉంది. కులాల వారీగా కమిటీలు వేసి క్షేత్రస్థాయిలో సమస్యలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. 2029లో వైఎస్‌ జగన్‌ను ముఖ్యమంత్రిని చేయాలన్న కృతనిశ్చయంతో పనిచేయాలి.–పొన్నాడ సతీష్‌కుమార్‌,

మాజీ ఎమ్మెల్యే, ముమ్మిడివరం

8

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement