తగ్గుతున్నది | - | Sakshi
Sakshi News home page

తగ్గుతున్నది

Aug 29 2026 12:23 AM | Updated on Aug 29 2026 12:23 AM

ఐ.పోలవరం: గోదావరి వరద క్రమంగా తగ్గుముఖం పడుతోంది. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి బుధవారం 3,55,194 క్యూసెక్కుల నీటిని దిగువకు విడిచిపెట్టారు. గురువారం ఉదయం 6 గంటలకు ఇది 5,17,171 క్యూసెక్కులకు పెరిగింది. ఇది శుక్రవారం ఉదయం 6 గంటలకు 4,20,616 క్యూసెక్కులకు తగ్గింది. అయితే, జిల్లాలోని గౌతమి, వృద్ధ గౌతమి, వైనతేయ, వశిష్ట గోదావరి పాయల్లో ఆ ఉరవడి కొనసాగుతూనే ఉంది. ఐ.పోలవరం మండలం అన్నంపల్లి అక్విడెక్ట్‌ వద్ద వరద నీరు సముద్రం వైపు పరుగులు తీస్తోంది. ఐ.పోలవరం, కాట్రేనికోన, ముమ్మిడివరం, అల్లవరం, మామిడికుదురు, మలికిపురం, సఖినేటిపల్లి మండలాల్లోని ఆక్వా చెరువులను వరద మరో సారి ముంచెత్తింది. ఈ నెల మొదటి వారంలో వరదకే ఆక్వా చెరువులు పెద్ద ఎత్తున దెబ్బ తినడంతో, ఇప్పు డు పెద్దగా ప్రభావం లేదని రైతులు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement