నెలకు సరిపడ సరకులు కొనాలంటే భయం వేస్తోంది. పప్పు, నూనె, చక్కెర ధరలు భారంగా ఉన్నాయి. పెరిగిన ధరలు ఇంటి ఖర్చులను తారుమారు చేస్తున్నాయి. చాలా మంది పండగలకు పిండి వంటలు కూడా చేసుకునేలా లేరు. అన్ని ధరలూ ఇంతలా పెరగడం ఎప్పుడూ చూడలేదు.
– గండుమేను నాగలక్ష్మి,
గృహిణి, గొల్లపాలెం, మలికిపురం మండలం
రెండు నెలల్లో
ఇంత పెరుగుదలా?
రెండు నెలల క్రితం రూ.55 ఉన్న సన్న బియ్యం ఇప్పుడు రూ.70 దాటింది. దొడ్డు బియ్యం కూడా రూ.50 అయింది. ఇక సామాన్యులు ఎలా బతుకుతారు? ధరల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం చాలా దారుణం.
– దేవాదుల సూర్యనారాయణ, అమలాపురం
కూరగాయల ధరలు
భారీగా పెరిగాయి
కూరగాయల ధరలు భారీగా పెరిగాయి. వరదలు, ఎల్‌నినో కారణంతో పంటలు పండటం లేదని వ్యాపారులు చెబుతున్నారు. అప్పుడే ఎల్‌నినో ప్రభావం వచ్చినట్లు చెబుతున్నారు. ఉల్లిపాయ ధర కేజీ రూ.70 వరకూ పలుకుతుంటే సామాన్యులు ఎలా బతుకుతారు?
– వాసిరెడ్డి వీరబాబు, ప్రైవేటు ఉద్యోగి,
నర్శిపూడి, ఆలమూరు మండలం


