పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం గతంలో చమురు ధరలు పెంచడం.. దానిపై జీఎస్‌టీని రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం తగ్గించకపోవడంతో దేశంలోనే ఎక్కడా లేనంత అధికంగా మన రాష్ట్రంలో పెట్రోలు, డీజిల్ రేట్లు ఉన్నాయి. దీంతో, రవాణా ఖర్చులు పెరిగాయని వ్యాపారులు అంటున్నారు. అయితే, అంతర్జాతీయ పరిస్థితులు, ఎల్‌నినో వంటి కారణాలను చూపుతూ ధరలు పెంచుతున్నారే తప్ప.. ఆ పరిస్థితులు మారిన సందర్భాల్లో ఆ ప్రయోజనాలను తమకు అందించడం లేదని వినియోగదారులు విమర్శిస్తున్నారు. మరోవైపు శ్రావణ మాసంలో శుభకార్యాలు, పండగలు అధికంగా ఉండటంతో నిత్యావసరాలకు డిమాండ్ పెరిగిందనే సాకుతో వ్యాపారులు ధరలు పెంచుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఎల్‌నినో పేరుతో కృత్రిమ కొరత సృష్టించి మరీ ధరలు పెంచుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెరుగుతున్న ధరలకు కళ్లెం వేయాల్సిన ప్రభుత్వం చోద్యం చూస్తోందని ధ్వజమెత్తుతున్నారు. ధరల నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
● కొండెక్కిన
నిత్యావసరాలు
● భయపెడుతున్న బియ్యం రేట్లు
● కాగుతున్న వంటనూనెలు
● కొందామంటే కూరగాయాలే
● పండగల వేళ చుక్కలు చూస్తున్న జనం
● చోద్యం చూస్తున్న ప్రభుత్వం


