కిక్కురుమనరేం! | - | Sakshi
Sakshi News home page

కిక్కురుమనరేం!

Aug 19 2026 12:12 AM | Updated on Aug 19 2026 12:12 AM

సాక్షి ప్రతినిధి, కాకినాడ: కూటమి ప్రభుత్వంలో మద్యం ఏరులై పారుతోంది. విచ్చలవిడిగా విక్రయాలు జరుగుతూ అన్ని సమయాల్లో మందు అందుబాటులో ఉంటోంది. ప్రభుత్వ ప్రోత్సాహం, మద్యం మాఫియా రెచ్చిపోతుండటంతో అనధికారిక విక్రయాలు పెరిగిపోయాయి. నియంత్రించాల్సిన ఎకై ్సజ్‌, పోలీసులు మామూళ్ల మత్తులో జోగుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. దీనికి తోడు బెల్టు షాపులను ఎక్కడపడితే అక్కడే ఏర్పాటు చేసేశారు.

ఊరూరా బెల్టు జోరు

చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన అనంతరం మద్యం విక్రయాలను ప్రైవేటుకు కట్టబెట్టారు. టీడీపీ నేతల కనుసన్నల్లోనే మద్యం సిండికేట్‌ కొనసాగుతోంది. అధికారం ఉంది కదా అని అడ్డగోలు వ్యవహారానికి తెర తీస్తున్నారు. మద్యం షాపు అందుబాటులో లేని గ్రామాలను ఎంపిక చేసుకుని బెల్ట్‌ షాపులను ప్రోత్సహిస్తున్నారు. వెరసి గ్రామీణ ప్రాంతాల్లో గల్లీకో బెల్టు దుకాణం వెలిసింది. వాటిని అరికడుతున్నామని ప్రభుత్వం ప్రగల్భాలు పలుకుతోందే తప్ప, నియంత్రించిన దాఖలాలు లేవు.

మద్యం షాపులకు అనుగుణంగా..

కాకినాడ జిల్లాలో 170, కోనసీమ జిల్లాలో 133 మద్యం షాపులకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. వీటికి సామర్లకోట ఐఎంఎల్‌ డిపో నుంచి మద్యం సరఫరా చేస్తున్నారు. ఇప్పటికే క్వార్టర్‌పై రూ.10 నుంచి రూ.20 వరకు పెంచి విక్రయిస్తున్నారు. ఇది చాలదన్నట్లు అక్రమార్జన కోసం అర్రులు చాస్తున్నారు. ఒక్కొ మద్యం దుకాణానికి అనుబంధంగా కనీసం 5 నుంచి 10 బెల్ట్‌ షాపులు ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఈ విధంగా ఈ రెండు జిల్లాల్లోని దాదాపు ప్రతి గ్రామంలోనూ నాలుగేసి బెల్టు షాపుల ద్వారా మద్యం ఏరులై పారిస్తున్నారు. అధిక ధరలతో మందుబాబుల జేబులు కొల్లగొడుతున్నారు.

మద్యం బాటిళ్లు

అధిక ధరలకు విక్రయం!

మద్యం షాపుల్లో ధరలు పెరగడంతో దానికి అనుగుణంగా నడుస్తున్న బెల్ట్‌ షాపుల్లో సైతం మరింత బాదుడు తప్పడం లేదు. ప్రతి మద్యం షాపునకు అనుబంధంగా ఉన్న బెల్ట్‌ షాపుల్లో రూ.30 నుంచి రూ.50 పెంచి మందుబాబుల జేబులకు చిల్లు పెడుతున్నారు. మందుబాబుల అభిరుచులకు అనుగుణంగా డోర్‌ డెలివరీ సైతం చేస్తున్నారు. వారికి కావాల్సిన బ్రాండ్లకు ఫోన్‌లో ఆర్డర్‌ ఇస్తే చాలు, అనుకున్న సమయానికి చేరిపోతున్నాయి.

పండగలు, పుట్టిన రోజు, పెళ్లిరోజు తదితర పార్టీలకు ఎక్కువ మొత్తం ఆర్డర్లు ఇస్తున్నారు. గతంలో ఎమ్మార్పీ కంటే ఒక్కో బాటిల్‌ఊపై రూ.30 నుంచి రూ.50 వరకు వసూలు చేసేవారు. ప్రస్తుతం బాటిల్‌పై రూ.10 పెరగడంతో వారి ధర సైతం పెంచేశారు. ప్రస్తుతం రూ.50 నుంచి రూ.60 అదనంగా తీసుకుంటున్నారు.

యథేచ్ఛగా విక్రయాలు

మండల కేంద్రాల్లోని మద్యం షాపుల ద్వారా బెల్ట్‌ షాపులకు మద్యం తరలిస్తున్నారు. ఏ గ్రామంలో ఎవరు బెల్ట్‌ షాపు నిర్వహించాలి? ఎంత మొత్తం చెల్లించాలన్న విషయమై మద్యం షాపు యజమానులు నిర్వహించిన ధరను చెల్లించి మరీ గొలుసు దుకాణాలు నిర్వహిస్తున్నారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. డబ్బులు తీసుకుని బెల్ట్‌ షాపులను మద్యం యజమానులు ప్రోత్సహిస్తున్నారని ఆరోపిస్తున్నారు. వారు నిర్ణయించిన వ్యక్తి కాకుండా ఇతరులు ఎవరైనా విక్రయస్తే మాత్రం ఎకై ్సజ్‌, పోలీసు అధికారులకు సమాచారం ఇచ్చి దాడులు చేయిస్తున్నట్లు తెలిసింది.

ఫ జోరుగా మద్యం అమ్మకాలు

ఫ విచ్చలవిడిగా బెల్ట్‌ షాపులు

ఫ ధరలు పెంచి దందా

ఫ పట్టించుకోని అధికారులు!

ఫ తూతూమంత్రంగా దాడులు

ఫ కాకినాడ, కోనసీమ జిల్లాల్లో

170 మద్యం దుకాణాలు

ఫ ప్రతి దుకాణం పరిధిలో

5 నుంచి 10 బెల్ట్‌ షాపులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement